మాస్ IPL.. మెగా”T20″చూపిస్తే.. సునామీనే…!

లగాన్ మూవీ గుర్తుందా...? అప్పటి వరకు క్రికెట్ అంటే టీవీలోనే చూసే జనాలు... థియేటర్ కి వెళ్లి మరీ క్రికెట్ మ్యాచ్ ని చూడ్డం అక్కడి నుంచే మొదలైంది. ఏకంగా ఈ సినిమా అప్పట్లో ఆస్కార్ కి నామినేట్ కూడా అయ్యింది..

Post Published By: dialnews
Updated : 8 May 2026, 6:50 PM IST

లగాన్ మూవీ గుర్తుందా...? అప్పటి వరకు క్రికెట్ అంటే టీవీలోనే చూసే జనాలు... థియేటర్ కి వెళ్లి మరీ క్రికెట్ మ్యాచ్ ని చూడ్డం అక్కడి నుంచే మొదలైంది. ఏకంగా ఈ సినిమా అప్పట్లో ఆస్కార్ కి నామినేట్ కూడా అయ్యింది... అప్పటి నుంచి నిజంగా ఇండియా సంబంధించిన క్రికెట్ మ్యాచుల్ని థియేటర్స్ లో కూడా లైవ్ లో చూడటం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఓపెన్ థియేటర్స్ నడుస్తున్నాయి. బార్స్ అండ్ రెస్టారెంట్స్ లో ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు కూడా.. నిజంగా లగాన్ కథకి అంత సీన్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే, లగాన్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ నిజం అనిపించేంత గొప్ప మ్యాచ్ ఉంది.. అదే 90శాతం సినిమాను కాపాడింది... ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరన్ మూవీ పెద్దిని కాపాడేది ఐపీఎలేనా? పెద్దిలో చరణ్ వేస్తోంది ఆటకూలీ పాత్ర... అంటే పెద్ది మూవీ క్రికెట్ మ్యాచ్ సినిమాకాదు.. అలాని కాదని కూడా కాదు.. చాలా ఆటలే ఇందులో ఉండబోతున్నాయి..కానీ ట్వంటీ ట్వీంటీ క్రికెట్ మ్యాచే రామ్ చరణ్ ని కాపాడేలా ఉంది. ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి వరుస ప్లాపులతో పాన్ ఇండియా ఐడెంటిటీ, మార్కెట్ ని రామ్ చరణ్ కోల్పోయేలా ఉన్నాడు.. అలాకాకుండా తనని కాపాడేది క్రికెక్కేట్టేనా? ఈ ప్రశ్నకి సమాధానం కూడా సిక్సులు, ఫోర్లతోనే దొరికేలా ఉంది.

రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ చేయటం అద్రుష్టం అయితే.. ఆ సినిమా తో వచ్చిన పేరు, గ్లోబల్ గుర్తింపు తగ్గట్టు, తర్వాత చేసిన సినిమాలు ఆడకపోవటం తన బ్యాడ్ లక్.. ఆచార్య అద్భుతాలు చేస్తుందంనుకుంటే, పంచ్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్ అయితే 350 కోట్ల బ్లండర్ గా మొదటి షోతోనే జనం డిక్లేర్ చేశారు.నిజం చెప్పాలంటే రాజమౌళి డైరెక్షన్ లో భూమి బద్దలయ్యే రేంజ్ హిట్ పడ్డాక, ఆ హీరో మళ్లీ హిట్ కొట్టడం కష్టం అన్న సెంటిమెంట్ కి రామ్ చరణ్ బలయ్యాడు. ఇది కేవలం సెంటిమెంట్ కాదు. రాజమౌళి తన హీరోలని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళతాడు.. కాబట్టి,ఆతర్వాత మరే దర్శకుడితో ఆ హీరో సినిమా చేసినా, ఆకాశమంత అంచనాలు అందుకోలేక, డిజాస్టర్లు పడటం కామన్.

ఇప్పుడా డిజాస్టర్ల నుంచి రామ్ చరణ్ ని కాపాడేది క్రికెట్.. అంతే పెద్ది మూవీ కథ కంటే, క్రికెట్టే ఈ సినిమాను కాపాడే అవకాశాలు ఉన్నాయా? అంటే డెఫినెట్ గా.. ఒకసారి లగాన్ ని గుర్తు తెచ్చుకోండి.. అంత మైండ్ బెండ్ అయ్యేంత కథేముంది...బ్రిటీషర్లకు పన్ను కడతారా? క్రికెట్ లో గెలిచి పన్ను నుంచి తప్పించుకుంటారా? సింపుల్ లైన్..తర్వాతంతా, హీరో అండ్ కో క్రికెట్ ప్రాక్టీస్.. ఫైనల్ గా క్రికెట్ మ్యాచ్ బ్రిటీషర్స్ కి ఎగైనెస్ట్ గా గెలవటం... అంతేకా.. నిజం చెప్పాలంటే లాగన్ మూవీ వచ్చే వరకు ఆమీర్ ఖాన్, ఖాన్ త్రయంలో ఒక చిన్న భాగం మాత్రమే.. అప్పటి వరకు తను ఒక మంచి నటుడే కావొచ్చు.. కాని షారుఖ్, సల్మాన్ ఇద్దరే సూపర్ మాస్ హీరోలు... అలాంటి టైంలో ఈ యావరేజ్ స్టార్ అమీర్ ఖాన్, ని సూపర్ స్టార్ గా మార్చింది లగాన్..

అంతే లాగాన్ లో తను సిక్స్ కొడితే, ఆ బాల్ బ్రిటన్ లో పడింది... ఆ తర్వాతే రియల్ క్రికెట్ మ్యాచ్ లని కూడా థియేటర్స్ లో లైవ్ వేస్తే ఎలా ఉంటుందనే ట్రెండ్ మొదలైంది. కట్ చేస్తే, ఇప్పుడు లగాన్ తర్వాత అంతకుమించేలా క్రికెట్ మ్యాచ్ ని చూపించే ప్రయత్నం చేస్తోంది పెద్ది టీం. ఇందులో హీరో ఆటకూలి అని అందరికి తెలుసు.ఆటకూలీ అంటే, ఒక మ్యాచ్ ఆడితే, ఇంత అని కూలి ఇచ్చి ఆడిపించుకునే కల్చర్ ఉన్న ఏరియాలో ఈ హీరో జర్నీనే సినిమా కథ... క్రికెట్ తోపాటు చాలా ఆటల మీద మంచి పట్టున్న హీరో ఆటకూలీగా ఎలాంటి సాహసాలు చేశాడు.. ఎవరితో గెలిచాడనే పాయింట్ తో పెద్ది వస్తోంది. ఐతే ఇందులో 60శాతం క్రికెట్ మ్యాచే ఉండబోతోంది.. జస్ట్ ఇమాజిన్ అంత పెద్ద స్క్రీన్ మీద, ఊర మాస్ లెవల్లో క్రికెట్ మ్యాచ్ ని, పాన్ ఇండియా లెవల్ సినిమాటిక్ మేకింగ్ తో చూపిస్తే ఎలా ఉంటుంది.క్రికెట్ లవర్స్ అంతా పెద్ది కోసం క్యూ కట్టే ఛాన్స్ ఉంది. కాబట్టే పెద్ది డెఫినెట్ గా పాన్ ఇండియా లెవల్లో మూడో ఫ్లాప్ అన్న కామెంట్స్ కి బ్రేక్ వేసే చాన్సెసే ఎక్కువ.. కథ ఓమాదిరీగా ఉన్నా, ఇందులో క్రికెటర్ గా రామ్ చరణ్ పాత్ర చాలా మంది క్రికెట్ లవర్స్ కి కనెక్ట్ అయ్యే చాన్స్ఉంది. అందుకు కథ కూడా తోడైతే, ఇక మెగా పవర్ స్టార్ దశ తిరిగినట్టే.

Published : 
  • 8 May 2026, 6:50 PM IST