దాన వీర శూర కర్ణ.. ఈ టైటిల్ వినగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తాడు.. అంతగా ఆ పాత్రకి తను ప్రాణం పోశాడు.. అదే ప్రయత్నం నటసింహం బాలయ్య కూడా ఆ ప్రయత్నం చేసినా, కర్ణుడంటే ఎన్టీఆరే గుర్తొస్తాడు.. అందుకే ఆ పాత్ర మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ గా మిగిలింది. అలాంటి పాత్ర వేసేందుకు తపన పడుతున్న తనకి, అలాంటి కథ దొరకలేదు.. కాని ఈలోపు కర్ణుడిగా మైండ్ బ్లాంక్ చేసేలా ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆల్రెడీ కల్కీ ఫస్ట్ పార్ట్ లో కాసేపే తను కర్ణుడిగా కనిపిస్తే, 1200 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. కట్ చేస్తే, ఇప్పుడు అదే కల్కీ కి సీక్వెల్ గా రెండో భాగం రెడీ అవుతోంది. సడన్ గా షూటింగ్ మొదలు పెట్టి, సడన్ గా వేగం పెంచారు.. ఎందుకో ఎవరికీ అర్దం కావట్లేదు. కొన్ని ప్రచారాలు చూస్తే మార్చ్ రిలీజ్ అని తెలుస్తోంది. ఇంకొన్న ప్రచారాలతో ఇది సంక్రాంతి సినిమా అన్న మాటే తూటాలా పేలుతోంది. ఇంతకి ఏది నిజం... కల్కీ 2 ని ఎందుకు దాన వీర శూర కర్ణ అనంటున్నారు?
రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడిగా మారాడు.. ఈ జెనరేషన్ కి కర్ణ అంటే ఏంటోచూపించబోతున్నాడు. ఆల్రెడీ కల్కీ 2898 ఏడీ లో కాసేపే కర్ణుడిగా కనిపించాడు. కాని దాని సీక్వెల్ కర్ణ 3102 బీసీ లో మాత్రం మ్యాగ్జిమమ్ ఆ పాత్రలోనే కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలుగు జనాలకు కర్ణుడంటేఎన్టీఆరే... అంతగా ఆ పాత్రలో పాతుకుపోయాడు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈతరానికి ఎన్టీఆర్ కర్ణుడిగా తెలుసు కావొచ్చు.. కాని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే, ఈతరానికి తగ్గట్టు ఎవరైనా కర్ణుడి పాత్రలో దూసుకెళ్లాలి.. అదే ఎన్టీఆర్ జూనియర్ డ్రీమ్. తాతకి తగ్గ మనవడిగా, దాన వీర శూర కర్ణగా మారాలనుకున్నాడు. కాని అలాంటి కథలు పడలేదు. తీసే దర్శకుడుతో కాంబినేషన్ కుదర్లేదు.
అందుకే జైలవకుశ, టెంపర్ లాంటి మూవీల్లో నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ, కొంతంవరకు తనలోని కర్ణుడిని కూల్ చేస్తూ వచ్చాడు. అయితే కల్కీలో కర్ణుడిగా కనిపించి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన ప్రభాస్, ఇప్పుడు కల్కీ సీక్వెల్ లో ఫుల్ లెంథ్ కర్ణుడి రోల్ చేయబోతున్నాడు. అదేజరిగితే, పరోక్షంగా జెన్ జీలకు అంటే ఈ తరానికి మాడ్రన్ కర్ణుడిగా ప్రభాస్ గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ షూటింగ్ మొదటి భాగం తీసేప్పుడే 30శాతం పూర్తి చేశారు. ఇప్పుడు ప్రభాస్ వచ్చి జాయిన్ అయితే, ఒకే నెలలో 20శాతం పైనే షూటింగ్ పూర్తి చేయబోతున్నారు.కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఆల్రెడీ కల్కీ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ వంతే మిగిలింది. ఎట్టి పరిస్థితుల్లో 2027 సంక్రాంతికి కల్కీ 2 రావాల్సిందే అనేది నాగ్ అశ్విన్ టార్గెట్. వారణాసి రిలీజ్ కి కనీసం మూడు నాలుగు నెలల ముందే కల్కీ 2 అంటే కర్ణ 3102 బీసీ రిలీజ్ అవ్వాలనేది దర్శక నిర్మాతల నిర్ణయం.. అందుకే వేగం పెంచారు.
మూడంటే మూడు షెడ్యూల్స్ లో పెండింగ్ 70శాతం లో 60 శాతం తీస్తే. ఓవరాల్ గా ఈ సినిమా 90శాతం షూటింగ్ పూర్తైనట్టే..మిగతావి పాటలు, ప్యాచ్ వర్క్ మాత్రమే..అది ప్రభాస్ మరో మూవీ షూటింగ్ తో బిజీ అయినప్పుడు కూడా తీయొచ్చు.. అందుకే ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్ లోగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తిచేసి, సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యేలా పోస్ట్ ప్రొడక్షన్ ని మొదలుపెట్టబోతున్నారు...ఇక ఇందులో 60శాతం నుంచి 70శాతం వరకు కర్ణుడి పాత్రే మేయిన్ లీడ్ అని తెలుస్తోంది. భైరవ పాత్ర కేవలం సైడ్ రోల్ లానే అప్పడప్పుడు కనిపించే అవకాశం ఉందట. అందుకే టైటిల్ ని కూడా కర్ణ 3102 బీసి గా ఫిక్స్ చేసింది ఫిల్మ్ టీం.