ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్… అగ్రస్థానంలోనే బుమ్రా…!

ప్రపంచ క్రికెట్లో తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 879

Post Published By: dialnews
Updated : 14 May 2026, 1:15 PM IST

ప్రపంచ క్రికెట్లో తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 879 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. గతేడాది నవంబర్ నుంచి భారత్ ఎటువంటి టెస్ట్ మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ.. బుమ్రా పాయింట్ల పరంగా తన స్థానాన్ని కాపాడుకున్నాడు. బుమ్రా తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఉన్నారు. మరో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ నాలుగో స్థానంలో నిలిచాడు.

బుమ్రా మాత్రమే కాకుండా మరికొందరు భారత బౌలర్లు కూడా మెరుగైన ర్యాంకుల్లో ఉన్నారు. మహమ్మద్ సిరాజ్ 12వ స్థానంలో నిలవగా.. స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా 14వ స్థానంలో, కుల్దీప్ యాదవ్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కీలక పాత్ర పోషించే ఈ ర్యాంకింగ్స్, భారత బౌలింగ్ విభాగం ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తోంది.బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ తన సత్తా చాటుతున్నారు. యువ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ 750 పాయింట్లతో 8వ స్థానంలో స్థిరంగా ఉండగా.. శుభ్‌మన్ గిల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 730 పాయింట్లతో 9వ స్థానానికి చేరుకున్నాడు.

వీరిద్దరూ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 880 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ తర్వాత భారత్ ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. ప్రస్తుతం ఆటగాళ్లంతా ఐపీఎల్ 2026 సీజన్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ వేదికపై వారి ర్యాంకులు మాత్రం చెక్కుచెదరలేదు. కాగా ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ అంతర్జాతీయ షెడ్యూల్ తో బిజీ కానుంది. జూన్ లో ఆప్ఘనిస్థాన్ తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. అయితే ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీలో భాగం కాదు.

Published : 
  • 14 May 2026, 1:15 PM IST