ప్రస్తుతం ప్రపంచమంతా చైనా వైపే చూస్తోంది. ఎందుకంటే, అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ మధ్య బీజింగ్‌లో ఒక హై-వోల్టేజ్ మీటింగ్ జరిగింది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ మీటింగ్‌కు సంబంధించిన విజువల్స్ చూసిన ఇంటర్నేషనల్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. పైకి ఇద్దరు నేతలు నవ్వుతూ కరచాలనం చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నా, తెర వెనుక ఇద్దరి మైండ్ గేమ్స్ నడుస్తున్నాయట. ఒకవైపు ట్రంప్.. జిన్‌పింగ్‌తో తనకు చాలా పర్సనల్ బాండింగ్ ఉందని చూపించుకోవడానికి తెగ ట్రై చేస్తుంటే, జిన్‌పింగ్ మాత్రం చాలా దూరంగా, అస్సలు ఇంట్రెస్ట్ లేనట్లు కోల్డ్‌గా కనిపిస్తున్నారు. అసలు నిన్న బీజింగ్‌లో ఏం జరిగింది..? ఆ ఇద్దరు టాప్ లీడర్స్ బాడీ లాంగ్వేజ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి..?
మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి డోనాల్డ్ ట్రంప్ చాలా ఉత్సాహంగా కనిపించారు. జిన్‌పింగ్‌ను చూస్తూనే ఆయన ఒక గ్రేట్ లీడర్ అని, మా ఇద్దరి మధ్య చాలా కాలంగా మంచి పరిచయం ఉందంటూ తెగ పొగిడేశారు. మీడియా ముందు కూడా తామిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్లు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రంప్ తెగ తాపత్రయపడ్డారు. కానీ, చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ వైపు నుండి మాత్రం అలాంటి రెస్పాన్స్ అస్సలు కనిపించలేదు. జిన్‌పింగ్ చాలా డిగ్నిఫైడ్‌గా, ఒక రకమైన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నిలబడ్డారు.
ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ లేవు. ఎంతసేపూ అమెరికాతో బిజినెస్ డీల్స్, గ్లోబల్ స్టెబిలిటీ గురించే జిన్‌పింగ్ మాట్లాడారు తప్ప.. పర్సనల్ రిలేషన్స్ పెంచుకోవడానికి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ కాంట్రాస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. జనరల్‌గా డోనాల్డ్ ట్రంప్ హ్యాండ్‌షేక్ స్టైల్ గురించి ప్రపంచమంతటికీ తెలుసు. అవతలి వాళ్ల చేతిని గట్టిగా పట్టుకుని, తన వైపు లాక్కుని.. ‘నేనే ఇక్కడ బాస్’ అని చూపించుకోవడం ట్రంప్ పాత అలవాటు. కానీ నిన్న జిన్‌పింగ్‌తో కరచాలనం చేసేటప్పుడు సీన్ కొంచెం రివర్స్ అయింది.
ట్రంప్ ఎప్పటిలాగే క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ చేతిని గట్టిగా పట్టుకున్నా, జిన్‌పింగ్ మాత్రం తన భుజాలను, తలను కొంచెం వెనక్కి జరిపి.. చాలా స్ట్రెయిట్‌గా నిలబడ్డారు. బాడీ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం.. ఒక వ్యక్తి తన శరీరాన్ని కొంచెం వెనక్కి జరుపుతున్నాడంటే, అవతలి వ్యక్తి చూపిస్తున్న అతి చొరవ అతనికి అస్సలు నచ్చడం లేదని అర్థం. జిన్‌పింగ్ చూసిన ఆ కోల్డ్ లుక్.. "నువ్వు అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, కానీ ఇక్కడ నా రూల్స్ నడుస్తాయి" అని చెప్పకనే చెప్పినట్లు ఉందంటున్నారు విశ్లేషకులు.
అయితే ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది. ఎప్పుడూ చాలా అగ్రెసివ్‌గా ఉండే ట్రంప్.. జిన్‌పింగ్ దగ్గర ఎందుకు కొంచెం తగ్గుతున్నారు..? చైనాకు ఎందుకంత అడ్వాంటేజ్ వచ్చింది..? నిజానికి ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ రాజకీయాలే దీనికి కారణం. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం, గ్లోబల్ ట్రేడ్ వార్, మరియు తైవాన్ లాంటి ఇష్యూస్ అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ క్రైసిస్ నుండి బయటపడాలంటే అమెరికాకు చైనా హెల్ప్ చాలా అవసరం. అందుకే ఎలాగైనా జిన్‌పింగ్‌ను ప్రసన్నం చేసుకోవాలని, మంచి బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవాలని ట్రంప్ తనతో పాటు ఎలోన్ మస్క్, టిమ్ కుక్, జెన్సన్ హువాంగ్ లాంటి బిగ్గెస్ట్ అమెరికన్ సీఈఓలను కూడా వెంటబెట్టుకుని మరీ బీజింగ్ వెళ్లారు.
ఈ విషయం జిన్‌పింగ్‌కు బాగా తెలుసు. అందుకే చైనా తన అప్పర్ హ్యాండ్‌ను చూపిస్తూ.. ట్రంప్‌కు రెడ్ కార్పెట్ పరిచినా, బాడీ లాంగ్వేజ్‌లో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తోంది. బాడీ లాంగ్వేజ్ సంగతి పక్కన పెడితే.. నిన్నటి టాక్స్ లో టారిఫ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంధన సంక్షోభంపై ఇరు దేశాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఒక ఏడాది పాటు ట్రేడ్ వార్ కి బ్రేక్ ఇవ్వాలనే పాత ఒప్పందాన్ని పొడిగించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ట్రంప్ ఎంతగా క్లోజ్ అవ్వాలని చూసినా, జిన్‌పింగ్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినా.. అల్టిమేట్‌గా రెండు దేశాల మధ్య రిలేషన్స్ బాగుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సేఫ్‌గా ఉంటుందని ఇద్దరు నేతలూ ఒప్పుకున్నారు. సో చూశారుగా.. లీడర్స్ మాట్లాడే మాటల కంటే వాళ్ల కళ్లు, వాళ్లు నిలబడే పద్ధతే అసలు నిజాలను బయటపెడతాయి.