Top story: అమెరికాలో మన వాళ్ళ కష్టాలు అన్ని ఇన్ని కావు….. వింటే షాక్ అవుతారు…!

అమెరికాలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న భారతీయుల్ని లేఆఫ్స్ టెన్షన్ పెడుతున్నాయి.ఎప్పుడు ఊస్టింగ్ మెయిల్ వస్తుందోనని కలవరపడుతున్నారు.

Post Published By: dialnews
Updated : 23 May 2026, 3:30 PM IST

అమెరికాలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న భారతీయుల్ని లేఆఫ్స్ టెన్షన్ పెడుతున్నాయి.ఎప్పుడు ఊస్టింగ్ మెయిల్ వస్తుందోనని కలవరపడుతున్నారు.ఇప్పటికే ఉద్యోగాలు పోయిన H-1B వీసా హోల్డర్ల బాధలు వర్ణాతీతం.60రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఈలోగా స్పాన్సర్ దొరక్కుంటే వాళ్లు భారత్‌కు తిరిగి రావాల్సిందే.టెక్‌ కంపెనీల్లో కొన్నాళ్లుగా లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది.స్వదేశంలో జాబ్ పోతే..ఎలాగైనా బతికేయొచ్చు.రెండు,మూడు నెలల్లో ఏదో ఒక్క దగ్గర కొత్త జాబ్‌లో చేరిపోవచ్చు.అదే అమెరికాలో ఉద్యోగం ఊడితే...ఇలా ఉండదు.60 రోజుల్లో కొత్త స్పాన్సర్‌ని వెతుక్కోవాల్సిందే. లేదంటే అమెరికా నుంచి తిరిగి రావాల్సిందే.ఇప్పుడు ఇలా ఎంతో మంది భారతీయులు డాలర్ డ్రీమ్ డెస్టినేషన్‌లో నరకం చూస్తున్నారు.ఎన్నో ఏళ్లుగా ఉంటున్నోళ్లకూ కష్టాలు తప్పడం లేదు.ఓవైపు ఉద్యోగం లేక మరోవైపు ఫ్యామిలీని ఎలా పోషించాలో తెలియక సతమతమవుతున్నారు.

అమెరికా కల సాకారమైందని మురిసిపోతున్న వేళ.. ఒక్క లేఆఫ్ ఈమెయిల్ వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగాల కోతల్లో చిక్కుకున్న H-1B వీసాలపై పనిచేస్తున్న భారతీయులు ఇప్పుడు సంక్షోభంలో పడిపోయారు. ఉద్యోగం పోయిన 60 రోజుల్లోగా మరో స్పాన్సర్‌ను వెతుక్కోవాలనే అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రూల్ వారి పాలిట శాపంగా మారింది. గడువు లోపు కొత్త ఉద్యోగం దొరకకపోతే దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న టెన్షన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఈ 60 రోజుల డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించుకోవడానికి చాలా మంది ఉద్యోగులు తాత్కాలికంగా B-2 విజిటర్ వీసాకు మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇమ్మిగ్రేషన్ వాతావరణం ఈ మార్గాన్ని కూడా క్లిష్టం చేసింది.

అధికారులు ఇప్పుడు అదనపు పత్రాలను డిమాండ్ చేస్తూ.. బి-1/బి-2 వీసా దరఖాస్తులపై భారీగా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్‌లు, తిరస్కరణ నోటీసులు ఇస్తున్నారు. చట్టబద్ధంగా అవకాశం ఉన్నప్పటికీ.. వీసా మార్పిడికి ఆమోదం పొందడం ఐటీ ఉద్యోగులకు గగనమైపోతోంది.
ఏఐ కారణంగా టెక్ రంగంలో లేఆఫ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి.ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం కొన్ని నెలల్లోనే 144 టెక్ కంపెనీలు లక్షా 10వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో వేలాది మంది భారతీయులే ఉన్నట్లు అంచనా. హెచ్-1బి వీసా ప్రోగ్రామ్‌లో భారతీయులదే టాప్ ప్లేస్. గతేడాది యూఎస్ అధికారులు ఆమోదించిన మొత్తం వీసా పిటిషన్లలో 2.8 లక్షలు భారతీయులవే. కానీ ఈ భారీ డిపెండెన్సీ ఇప్పుడు వారికి పెద్ద శాపంగా మారింది.

ఈ క్రైసిస్ కేవలం ఒక జాబ్ లాస్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఒక దశాబ్ద కాలంగా గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ కోసం నిరీక్షిస్తూ అమెరికాలోనే ఇళ్లు కొనుక్కుని, అక్కడే పుట్టిన పిల్లల చదువులు చూసుకుంటున్న కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా అమెరికా టెక్ రంగానికి సేవ చేసినా.. చివరకు తమను ఇలా ఒంటరిగా వదిలేశారనే బాధ వారిలో కనిపిస్తోంది. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయంగా ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు, ఓ-1 వీసాల వైపు చూస్తున్నారు. మరికొందరు కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, యూరప్ దేశాలకు వలస వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
తాజాగా సింగపూర్, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లోని ఉద్యోగులకు మొదట ఇంటి నుంచి పని చేయాలని మెటా సూచించింది. అందుకు వారు రెడీ అవుతుండగా, వేకువజామున వారికి లేఆఫ్ మెయిల్స్ పంపించింది. ఎలాంటి గందరగోళం జరగకుండా ఉండేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బాధితుల్లో ఎక్కువమంది ఇంజినీరింగ్, ప్రోడక్ట్ బృందాలు ఉన్నాయి. అటు ప్రముఖ నెట్‌వర్కింగ్‌ సంస్థ సిస్కో.. మరోవిడత ఉద్యోగ కోతలను ప్రకటించింది.

ఈ త్రైమాసికంలో దాదాపు 4,000 మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.మైక్రోసాఫ్ట్ నేతృత్వంలోని లింక్డిన్ వందల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించబోతోంది. మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం అంటే దాదాపు 875 మందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా నిలదొక్కుకునేందుకు పలు మార్పులు అమలుచేశామని టెక్ కంపెనీలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు వాల్‌మార్ట్ 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అందరిని వేరే విభాగాలకు బదిలీ చేసింది. గ్లోబల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ బృందాలను విలీనం చేయబోతోంది. ఇలా.అమెరికా,యూరప్‌లోని హెచ్‌1బీ వీసాదారులపై లేఆఫ్స్‌ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది.ఇందులో ఎంత మంది భారతీయులు ఉన్నారనే దానిపై క్లారిటీ లేదు.మెుత్తానికి ఇండియాకు తిరిగి రాకుండా చూసుకునేందుకు ఉన్న అన్నిదారులూ వెతుక్కుతున్నారు హెచ్‌ వన్ బీ వీసా హోల్డర్లు.

Published : 
  • 23 May 2026, 3:30 PM IST