ఏపీ డిప్యూటీ స్పీకర్.... సంచలనాల కేంద్ర బిందువు... రఘురామకృష్ణరాజు అలియాస్ ఆర్ ఆర్ ఆర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దాని పేరు తెలుగు వీర లేవరా పార్టీ. అంటే దీనిని టి ఎల్ పి అని గాని, టీ వీ ఎల్ పి అనగానే పిలవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించి ఆర్ ఆర్ఆర్ గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసేసారు. అయితే తన పార్టీకి లాంచింగ్ ప్యాడ్ గా తెలివిగా తెలుగువీర లేవరా అనే సొసైటీని కూడా ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రధానంగా హిందూ ఆలయాల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తుందని తెలుస్తోంది. కానీ తెలుగు వీర లేవరా సొసైటీ అసలు టార్గెట్ పొలిటికల్ పార్టీ అని దీనికి సంబంధించి ఢిల్లీలో పని ప్రారంభించినట్లు రఘురామా సన్నిహితులు చెబుతున్నారు.
నిజానికి రఘురామ కృష్ణంరాజు టిడిపిలో అంత కంఫర్ట్గా ఏమీ లేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన తనకు హోం శాఖ మంత్రి పదవి దక్కుతుంది అని ఆశించారు. కానీ ఆయనను ఊరించి ఊరించి చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించి కాళ్లు ,చేతులు ,నోరు కదలకుండా చేసేసారు చంద్రబాబు, లోకేష్. దీనిపై మనసులో కుత కూత లాడిపోతున్న రఘురామ... అన్ని దిగమింగుకొని డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు. తన శక్తి సామర్థ్యాలను, దూకుడుని చంద్రబాబు వాడుకోలేకపోతున్నారని సన్నిహితుల దగ్గర ఆర్ ఆర్ ఆర్ చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే కూటమి సర్కారు ఏర్పడిన కొత్తలో రఘురామ కృష్ణంరాజు అసలు ఏపీలో తన వల్లే ప్రభుత్వం వచ్చిందని, తను జగన్ని ధైర్యంగా ఎదుర్కొని... జైలుకు వెళ్లడం వల్లే ఏపీలో ప్రజలంతా కూటమి పార్టీలను గెలిపించారణి అందువల్ల తనకి క్రెడిట్ వస్తుందని చెప్పుకున్నారని గాసిప్స్ నడిచాయి.
రఘురామకృష్ణ రాజు ఒక న్యూసెన్స్ కేసు... అందువల్ల ఆయన్ను ఎంతవరకు అనుమతించాలో అంతవరకే అనుమతించాలని.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ముగ్గురు ఆర్ ఆర్ ఆర్ తో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రఘురామా నిలకడ లేని వ్యక్తని ఏ క్షణంలోనైనా అడ్డం తిరిగిపోవచ్చని జనసేన ,టిడిపి అధినేతలకు అంతర్గతంగా భయం లేకపోలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రఘురామ కృష్ణంరాజు ఆకివీడులో రామాలయం వివాదాన్ని నెత్తికెత్తుకున్నారు. ఆలయ పునర్ నిర్మాణం అడ్డం పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో కావలసినంత పాపులారిటీ సంపాదించారు. క్రమంగా తనను హిందూ ధర్మ పరిరక్షకుడిగా ప్రాజెక్ట్ చేసుకోవడం ప్రారంభించారు. ఇదంతా 20 29 ఎన్నికల కోసమేనని అందరికీ తెలుసు.
ఆకివీడు రామాలయం విషయంలో ఇప్పటివరకు సీఎం చంద్రబాబు గాని ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఎక్కడ జోక్యం చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణం ఆర్ ఆర్ఆర్ తో ఏం చేసినా ప్రమాదమేనని వాళ్ళిద్దరూ అనుకోవడమే.
ఆర్ ఆర్ఆర్ దూకుడు వలన రెండేళ్లలో కొన్ని ఇబ్బందికర పరిస్తితులు కూడా వచ్చాయి. ఒక డీఎస్పీ విషయంలో రఘురామ ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే డి అంటే డి అన్నారు. ఈ పరిస్థితులను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తన భవిష్యత్ రాజకీయానికి కొత్తదారులు వేస్తున్నారు రఘురామ. ఇప్పుడు తెలుగువీర లేవరా పార్టీ పెట్టి... తన సొంత శక్తి ఏంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారాయన. ఈ పార్టీపై తాను నరసాపురం ఎంపీగా పోటీ చేసి, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి కావచ్చు అన్నది ఆర్ ఆర్ ఆర్ ఆలోచన. బిజెపి లైన్లోనే తన సొంత హిందుత్వ అజెండాతో రఘురామా జనంలోకి వెళ్తారు. అందుకే పొలిటికల్ పార్టీకి గ్రౌండ్ వర్క్ కోసం తెలుగువీర లేవరా సొసైటీ ప్రారంభించారు.
రఘురామా పొలిటికల్ పార్టీ పెడుతున్నారని వదంతులు రావడంతో... అటువంటి ఆలోచన ఏమీ లేదని, తాను టిడిపిలో చాలా సంతోషంగా ఉన్నానని ఒక వాట్సాప్ సందేశం కూడా ఇచ్చారు. తెలుగువీర లేవరా సొసైటీ కేవలం ప్రజా సేవ చేయడానికి మాత్రమే, ముఖ్యంగా ఆలయాల పరిరక్షణకు పనిచేస్తుందని వివరణ కూడా ఇచ్చారు. రఘురామకృష్ణం రాజు గురించి బాగా తెలిసిన వాళ్ళు... ఆయన వ్యూహాలు త్వరగా అర్థం కావని, రాజకీయ లక్ష్యం లేకుండా.... తనకు లాభం లేకుండా ఆయన ఏ పని చేయరని... అందువలన తెలుగువీర లేవరా కచ్చితంగా పొలిటికల్ పార్టీగా మారుతుందని.... ఆర్ ఆర్ ఆర్ ఎవరి కొంప మంచబోతున్నారని చెబుతున్నారు.