Top story: 2 ఏళ్లు వైట్‌హౌజ్‌ చుట్టూ తిరిగి ట్రంప్‌ లక్ష్యంగా దాడి…!

వైట్‌హౌస్ దగ్గర జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ట్రంప్‌ను చంపడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? అతన్ని ఎవరు పంపించారు? అమెరికాలో ఇలాంటి ఛాన్స్ కోసం ఇంకా ఎంత మంది వెయిట్ చేస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 25 May 2026, 10:19 AM IST

వైట్‌హౌస్ దగ్గర జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ట్రంప్‌ను చంపడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? అతన్ని ఎవరు పంపించారు? అమెరికాలో ఇలాంటి ఛాన్స్ కోసం ఇంకా ఎంత మంది వెయిట్ చేస్తున్నారు.. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ ఉండే వైట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ ఫెయిల్ అవ్వడం మరోసారి పెద్ద కలకలం రేపుతోంది. వైట్ హౌస్ దగ్గర్లో ఉన్న ఒక సెక్యూరిటీ చెక్‌పాయింట్ దగ్గరికి సడెన్‌గా గన్‌తో వచ్చిన ఒక వ్యక్తి.. అక్కడున్న సెక్యూరిటీ వాళ్లపై ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టాడు. వెంటనే అలర్ట్ అయిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లు తిరిగి కాల్చడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని మేరీల్యాండ్‌కు చెందిన నసీర్ బెస్ట్‌గా ఆఫీసర్లు గుర్తించారు. నసీర్‌ జరిపిన కాల్పుల్లో అక్కడే ఉన్న ఒక సామాన్య పౌరుడికి కూడా బుల్లెట్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల శబ్దాలు విన్న వెంటనే సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లు వైట్‌హౌస్ చుట్టుపక్కల అంతా లాక్‌డౌన్ చేశారు. అక్కడే పని చేస్తున్న జర్నలిస్టులను సేఫ్‌గా ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి పంపించారు.

పోలీసులు చేసిన ఎంక్వైరీలో చాలా ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ నసీర్ బెస్ట్ కొంతకాలంగా మెంటల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వైట్‌హౌస్ దగ్గర డ్యూటీ చేసే సెక్యూరిటీ వాళ్ళకి ఇతను బాగా తెలిసిన వ్యక్తే. పోయినేడాది జూన్, జూలై నెలల్లో వైట్‌హౌస్ దగ్గర రూల్స్ బ్రేక్ చేసినందుకు రెండుసార్లు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ టైంలో తాను 'ఏసుక్రీస్తు'నని, దేవుడి కొడుకునని వింతగా మాట్లాడుతూ.. తనను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులతో గొడవపడేవాడట. దీంతో అతడు వైట్‌హౌస్ పరిసరాలకి, ప్రెసిడెంట్ బిల్డింగ్‌కి దూరంగా ఉండాలని అప్పట్లోనే లోకల్ కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఆ ఆర్డర్స్ బ్రేక్ చేసినందుకు ఆగస్టులో అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా నసీర్‌ ఇప్పుడు ఏకంగా ఈ రేంజ్ దాడికి తెగబడ్డాడు.

అయితే ఈ దాడి వెనుక ఏదైనా పొలిటికల్ ప్లాన్ ఉందా? లేక కేవలం మెంటల్ కండిషన్ బాగోలేకే ఇలా చేశాడా? అనే యాంగిల్‌లో ఆఫీసర్లు సీరియస్‌గా ఎంక్వైరీ చేస్తున్నారు. అమెరికా సెంట్రల్ ఏజెన్సీ అయిన FBI, ATF, మెట్రోపాలిటన్ పోలీసులు అందరూ కలిపి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా యాప్ 'ట్రూత్ సోషల్' ద్వారా స్పందించారు. ఆ వ్యక్తిని వెంటనే మట్టుబెట్టినందుకు సీక్రెట్ సర్వీస్, లా ఆఫీసర్లను ఆయన మెచ్చుకున్నారు. ఫ్యూచర్ ప్రెసిడెంట్లకు కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, అమెరికాలో మరింత స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ఘటన చెప్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలోనే అత్యంత టైట్ సెక్యూరిటీ ఉండే వైట్ హౌస్ దగ్గర పదే పదే ఇలాంటి దాడులు జరగడం అక్కడి సెక్యూరిటీ సిస్టమ్‌పై అందరిలో టెన్షన్ పెంచుతోంది.

 

Published : 
  • 25 May 2026, 10:19 AM IST