టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ ఎవరు అంటే.. అందరూ ఒకే పేరు చెప్తారు. అదే.. 'శ్రీలీల'. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన డాన్స్, మరియు చలాకీతనంతో కుర్రకారు మనసు దోచేసిందీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ. ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయినప్పటికీ, శ్రీలీల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. వరుసగా క్రేజీ ఆఫర్లు ఆమె తలుపు తడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన ‘D-55’ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా నటిస్తోంది శ్రీ లీల. అంతేకాదు, బాలీవుడ్లో కూడా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కార్తీక్ ఆర్యన్ సరసన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘ఆషికీ-3’లో నటిస్తూ బిజీగా ఉంది.
కేవలం నటన, డాన్స్ మాత్రమే కాదు.. తన ఆలోచనలతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది శ్రీలీల. తాజాగా భాష, సంస్కృతి, మరియు వివిధ ప్రాంతాల ప్రేక్షకుల పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఇండియన్ సినిమాలో భాషా బేధాలు అనేవి పూర్తిగా చెరిగిపోయాయి. ఒక ఇండస్ట్రీ నటీనటులు మరో ఇండస్ట్రీలో నటిస్తూ పాన్-ఇండియా స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో, వేరే ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడి స్థానిక భాష మాట్లాడటం ఎంత ముఖ్యమో శ్రీలీల చాలా చక్కగా వివరించింది.వివిధ ప్రాంతాల ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం గురించి శ్రీలీల మాట్లాడుతుంటూ.. "నా విషయానికి వస్తే, నేను ప్రతి భాషను ఎంతో గౌరవిస్తాను. నేను స్వయంగా నాలుగు, ఐదు భాషల్లో పని చేస్తున్నాను.
నేను ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అక్కడ స్టేజ్ మీద ఉన్నంతసేపూ స్థానిక భాషలోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రాంతానికి, అక్కడి భాషకు, ఆ ప్రజలకు నేను ఇచ్చే కనీస గౌరవం అది" అని చెప్పుకొచ్చింది. పబ్లిక్ ఈవెంట్స్ లో ఇలా స్థానిక భాషలో మాట్లాడటం వల్ల ప్రేక్షకులకు, స్టార్స్ కు మధ్య ఉన్న దూరం తగ్గి, ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందని శ్రీలీల అభిప్రాయపడింది. ఇది కేవలం సినిమా పబ్లిసిటీ కోసం లేదా ప్రమోషన్స్ కోసం చేసే పని కాదని ఆమె స్పష్టం చేసింది. మనల్ని సెలబ్రిటీలుగా గుర్తించిన ఆయా ప్రాంతాల ఐడెంటిటీని, వారి సంస్కృతిని మనస్ఫూర్తిగా గౌరవించడమేనని ఆమె చాలా ఎమోషనల్ గా వివరించింది.శ్రీలీల తీసుకున్న ఈ నిర్ణయం, భాష పట్ల ఆమెకున్న అంకితభావం చూసి నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ఇంత మంచి మెచ్యూరిటీ ఉన్న ఆలోచనలు ఉన్నందుకే శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భాషా బేధాలు లేకుండా అన్ని పరిశ్రమల్లోనూ రాణిస్తూ, అందరి హృదయాలను గెలుచుకుంటున్న శ్రీలీల, ప్లాప్స్ హిట్స్ తో సంబంధం లేకుండా తన పంథాలో దూసుకెళ్తూ, తోటి నటీమణులకు గట్టిపోటీనిస్తోంది.