కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే ఒక్క వార్త ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. అదే.. తమిళనాడు ముఖ్యమంత్రి, కోట్లాది మంది అభిమానుల దళపతి విజయ్.. మరియు సౌత్ క్వీన్ త్రిష క్రిష్ణన్ విడిపోయారా? గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్న సైలెంట్ రిలేషన్‌షిప్‌కు ఇప్పుడు పూర్తిగా ఎండ్ కార్డ్ పడిపోయిందా? అవుననే అంటున్నాయి చెన్నై సినీ వర్గాలు. నిన్న జూన్ 22న సీఎం విజయ్ తన 52వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన సీఎం అయ్యాక వచ్చిన మొదటి బర్త్‌డే కావడంతో దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.కానీ, ప్రతి ఏటా అందరికంటే ముందే స్పెషల్ ఫోటోలతో విష్ చేసే త్రిష.. ఈసారి కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అంతటితో ఆగకుండా, విజయ్ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి అన్‌ఫాలో చేసి పెద్ద షాక్ ఇచ్చింది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? విజయ్ భార్య సంగీత ఎంట్రీతోనే త్రిష దూరం జరిగిందా? ఈ సంచలన మిస్టరీ వెనుక ఉన్న కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం.
విజయ్, త్రిషల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మనకు తెలిసిందే. గిల్లి, తిరుపాచ్చి నుంచి మొన్నటి లియో సినిమా వరకు వీరి జోడీ ఎవర్ గ్రీన్. అయితే గత మూడేళ్లుగా విజయ్ పుట్టినరోజు వచ్చిందంటే చాలు.. త్రిష సోషల్ మీడియాలో ఎవరూ చూడని అరుదైన, పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ.. 'నా ప్రేమికుడికి, నా శాంతికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఎంతో ఎమోషనల్ గా పోస్టులు పెట్టేది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. నిన్న విజయ్ బర్త్‌డే రోజున అభిమానులంతా త్రిష అకౌంట్ వైపు ఆశగా చూశారు.గంటలు గడుస్తున్నా త్రిష నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు త్రిష ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను వెరిఫై చేయగా.. అక్కడ అసలైన ట్విస్ట్ బయటపడింది. త్రిష తన ఇన్‌స్టా ఫాలోయింగ్ లిస్ట్ నుండి విజయ్ పేరును తీసేసింది. అంటే ఆయన్ను అన్‌ఫాలో చేసింది. ఈ ఒక్క మూవ్ సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. అసలు వీరు ఇంతలా దూరం కావడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తే.. దీని వెనుక విజయ్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది.. గత ఏడాది డిసెంబర్, అలాగే ఈ ఏడాది 2026 ఫిబ్రవరిలో విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఆమె విజయ్ ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారని, తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ నటి మరెవరో కాదు త్రిషనే అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, విజయ్ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త పార్టీతో బరిలోకి దిగి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.సీఎం అయ్యాక తన రాజకీయ భవిష్యత్తును, ఇమేజ్ను కాపాడుకోవడం విజయ్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలోనే విజయ్ తల్లి శోభ, అలాగే కుటుంబ పెద్దలంతా రంగంలోకి దిగారట. సంగీత, విజయ్ ల మధ్య రాజీ కుదిర్చి.. ఇద్దరినీ మళ్లీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేశారట. ప్రస్తుతం విజయ్ తన భార్యతో పాత విభేదాలు పక్కన పెట్టి, మళ్లీ కుటుంబ జీవితంపై ఫోకస్ పెట్టినట్లు చెన్నై వర్గాల సమాచారం. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ నడుస్తోంది. విజయ్ తన భార్య సంగీతకు మళ్లీ దగ్గరవడంతో.. ఆయన వ్యక్తిగత జీవితానికి, ముఖ్యమంత్రిగా ఆయన పొలిటికల్ కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే త్రిష స్వయంగా దూరం జరిగిందా? అనే చర్చ కూడా నడుస్తోంది.
ఒకవేళ రిలేషన్ లో ఉంటూ ఇలా అన్‌ఫాలో చేస్తే అది బ్రేకప్ కిందకే వస్తుంది. ఎందుకంటే గత నెలలోనే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష ప్రత్యేకంగా హాజరైంది. ఆ సమయంలో ఆమె కళ్లల్లో ఆనంద బాష్పాలు కూడా కనిపించాయి. అంతేకాదు, రీసెంట్గా అజిత్ తల్లి చనిపోయినప్పుడు కూడా విజయ్, త్రిషలు ఒకే కారులో కలిసి వెళ్లి నివాళులు అర్పించారు. అంతలా క్లోజ్‌గా ఉన్న వీరు.. ఈ ఒక్క నెలలోనే ఎందుకు అన్‌ఫాలో చేసుకునే స్థాయికి వెళ్లారు? కేవలం విజయ్ భార్యతో కలిసిపోవడం వల్లే త్రిష హర్ట్ అయిందా? లేక విజయ్ టీమే త్రిషను సోషల్ మీడియాలో దూరం పెట్టమని సలహా ఇచ్చిందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ అన్‌ఫాలో వ్యవహారంతో అటు దళపతి ఫ్యాన్స్, ఇటు త్రిష ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు. విజయ్ ఫ్యాన్స్ కొందరు త్రిషపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. "పర్సనల్ గా ఎలాంటి గొడవలు ఉన్నా.. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పైగా బర్త్‌డే.. కనీసం మర్యాద కోసమైనా ఒక విష్ పోస్ట్ పెట్టాల్సింది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు త్రిష ఆర్మీ మాత్రం ఆమెకు పూర్తి సపోర్ట్ ఇస్తోంది. "విజయ్ తన ఫ్యామిలీతో సెటిల్ అవుతున్నప్పుడు, త్రిష సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి ఆయన్ను దూరం పెట్టడమే కరెక్ట్.. ఆమె తీసుకున్న నిర్ణయం 100% రైట్" అంటూ త్రిషను వెనకేసుకొస్తున్నారు. నిజానికి తమిళ మీడియా ప్రకారం త్రిష మార్చిలోనే అన్‌ఫాలో చేసిందని కొందరు అంటుంటే.. లేదు, నిన్నటి వివాదం తర్వాతే ఈ మార్పు జరిగిందని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా అధికారికంగా వీరిద్దరూ నోరు విప్పితే కానీ అసలు నిజం బయటకు రాదు.