Top story: రాధా గాయత్రీ ది హత్యా? ఆత్మహత్యా? 10 రోజులైనా పోలీసులు ఎందుకు తేల్చలేకపోతున్నారు?

ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి ముస్సోరి లో మృతి చెంది పది రోజులవుతుంది. గాయత్రి ని ఎవరు చంపారో పెట్టండి అంటూ ఆమె తల్లి, తండ్రి పోలీసుల,అధికారులు, న్యాయకులు చుట్టూ ప్రదక్షణలు చేస్తునే ఉన్నారు.

Post Published By: dialnews
Updated : 26 June 2026, 11:15 AM IST

ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి ముస్సోరి లో మృతి చెంది పది రోజులవుతుంది. గాయత్రి ని ఎవరు చంపారో పెట్టండి అంటూ ఆమె తల్లి, తండ్రి పోలీసుల,అధికారులు, న్యాయకులు చుట్టూ ప్రదక్షణలు చేస్తునే ఉన్నారు. భర్త అత్తమామలు మాత్రం బయట స్వేచ్చగా తిరుగుతున్నారు. గాయత్రి భర్త శ్రీ చరణ్ ఎక్కడికో గాయబ్ పోయాడు .రాధా గాయత్రి మృతి కేసులో మిస్టరీ వీడేది ఎప్పుడూ? ఆమె ఆత్మకు శాంతి కలిగేది ఎప్పుడూ? నిందితుడుకి శిక్ష పడేది ఇంకెప్పుడూ? పెళ్లి చేసుకుని అన్యాయంగా ఆడపిల్ల బలైపోయింది. హత్య రూపంలో ఎదుర్కొంటున్న భర్త బయట తిరుగుతున్నాడు. కనీసం ఎవరు చంపారో.... లేదా ఆమె ఎలా చనిపోయిందో పోలీసులు తేల్చలేకపోతున్నారు.

మొదట అనుమానాస్పద మృతి కేసుగా, తర్వాత కీలక పరిణామాలు మధ్య హత్య కేసుగా మారింది రాధా గాయత్రి మృతి కేసు. ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్.. ఒక్కో మలుపు. కేసులో ప్రతి రోజు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న తన కూతురిది ముమ్మాటికీ హత్య ఏనని రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, తన కోడలి మృతికి కారణమేంటనేది పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప నిజ నిజాలు నిర్ధారణ అవ్వవని చెప్పుకొచ్చారు అత్తమామలు. కోడలు కొడుకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయని, కానీ అవి హత్యకు దారి తీసేయటంతో కాదని చెప్తున్నారు. ఇదిలా ఉండగా కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ముస్సోరి పోలీసులు శ్రీ చరణ్ ను పిలిపించారు. హత్య కేసు నమోదు చేయడంతో ఇప్పుడు శ్రీ చరణ్ ను కస్టడీలోకీ తీసుకుంటారా? లేదా అనేది సస్పెన్స్ గా మారింది..

రేపో మాపో పోస్టుమార్టం రిపోర్టు వస్తే అసలు విషయం బయటపడుతుంది.. మరోవైపు శ్రీ చరణ్ తల్లిదండ్రులు తమ కొడుకు కోడలు ఎంతో అన్యోన్యంగా ఉండే వారిని, భార్య భర్తల అన్నాక చిన్న చిన్న గొడవలు సాధారణమే అని చెప్పుకొచ్చారు.. అంతమాత్రాన తన కోడలిని తన కొడుకే హత్య చేశాడని ఎలా ఆరోపిస్తారు అన్నది వాళ్ళ వాదన. వారిద్దరి మధ్య నిజంగానే రిలేషన్షిప్ చెడిపోయి ఉంటే ముస్సోరి వెళ్లి అంత జాలీగా గడిపేవారు కాదని, ఈ వీడియోలు చూస్తేనే మీకు అర్థమవుతుందని అన్నారు..మరోవైపు తన కూతురుకి న్యాయం కోసం తల్లి సత్యవతి గత పది రోజుల నుండి ఎక్కని మెట్లు లేవు, తిరగని ఆఫీస్ లు లేవు. తన కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న అల్లుడికి తగిన శిక్ష విధించమని ప్రాదేయపడుతుంది. పెళ్లైన నాటి నుండి భార్యను అనుమానంతోనే వేధించేవాడని, ఆ అనుమానంతోనో తన కూతురిని దారుణంగా హత్య చేసాడని వాపోయింది. సైనిక బోర్డు అధికారులను కూడా కలిసి ఫిర్యాదు చేసారు రాధా గాయత్రి తల్లి సత్యవతి. అధికారుల ముందూ న్యాయం చేయమని బోరున విలపించింది ఆమె.

తన కూతురు అల్లుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యి 10 రోజులవుతుంది.నా కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు .నేను తిండి తిప్పలు మానేసి ఇక్కడ న్యాయం కోసం పోలిసులు చుట్టూ, నాయకులు చుట్టూ తిరుగుతున్నాను.మాకు న్యాయం జరిగేది ఎప్పుడూ...
ఓ ఆడపిల్ల తల్లిగా, మాజీ సైనికుడు బిడ్డకు న్యాయం చేయండి..హత్య చేసిన వాడు బయట దర్జాగా తిరుగుతున్నాడు. నా కూతురి మీద నిజంగా ప్రేమే ఉంటే అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య పెద్ద కర్మ రోజు కూడా రాకుండా ఎక్కడో దొంగలా దాక్కున్నాడు.ముస్సోరి వెళ్ళాడని శ్రీ చరణ్ తల్లిదండ్రులు చెప్తున్నారు. నా భర్త కూడ 5 రోజులు నుండీ అక్కడే ఉన్నాడు. హత్య కేసు నమోదు చేసారు కానీ వాడిని ఎందుకు అరెస్ట్ చేసి విచారణ జరపడం లేదు. మా బాధ పట్టడం లేదా, కడుపుకోత అర్ధకావడం లేదా. ఒక్కగానోక్క కూతురు చనిపోయినపుడు ఎంత బాధ అనుభవించిందో వాడికి అంతే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు..

శ్రీచరణ్ తల్లిదండ్రులు గత కొద్ది రోజుల నుండి సింహాచలం వీధుల్లో తిరుగుతునే ఉన్నారు.. చుట్టు పక్కలా ఉన్న స్థానిక లాడ్జిల్లో గదులు ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళ్లిన మీ కొడుకు మీద కేసు ఉందని మీకు గదులు ఇచ్చేది లేదని మోహం మీదే డోర్లు వేస్తున్నారు. బంధువుల ఇళ్లకు వెళ్లలేక, సొంతవారు ఎవరు పట్టించుకోకపోవడంతో తలదాచుకోవడానికి పగలు రాత్రుల్లు తిరుగుతున్నారు. కొడుకు చేసిన పాపమే ఇప్పుడు వారి పాలిట ఈ విధంగా శాపంగా మారిందని రాధా గాయత్రి బంధువులు ఆరోపిస్తున్నారు. సొంతవాళ్లు ఉన్నా సరే ఎవరూ కూడా చేరదీయడం లేదని అన్నారు. రాధా గాయత్రి పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పటివరకు రాలేదు. అది పోలీసులకు అందితే కానీ ఆ నివేదిక ప్రకారం చర్యలకు ముందుకు వెళ్లలేరు. శ్రీ చరణ్ బిహేవియర్ పై కొద్దిపాటి అనుమానం ఉన్నప్పటికీ, రాధా గాయత్రీ చనిపోయిన తీరు చూస్తే మాత్రం... హత్యా ఆత్మహత్య లేదా సాధారణ మరణమా అన్నది త్యాల్చలేకపోతున్నారు.

Published : 
  • 26 June 2026, 11:15 AM IST