చావు అంచున ఉన్న ప్లీజ్‌ సాయం చేయండి..!

శేఖర్ కమ్ముల 'ఫిదా' సినిమాలో సాయి పల్లవికి స్నేహితురాలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు.

Post Published By: dialnews
Updated : 25 June 2026, 9:59 AM IST

శేఖర్ కమ్ముల 'ఫిదా' సినిమాలో సాయి పల్లవికి స్నేహితురాలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. 'కొబ్బరి మట్ట', 'ఐస్ క్రీమ్' లాంటి సినిమాల్లో నటించిన గాయత్రి.. ముక్కుసూటిగా, ధైర్యంగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో కొందరు నిర్మాతలు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా గాయత్రి గుప్తా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక భావోద్వేగమైన వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. "గత కొద్ది నెలలుగా నాకు తీవ్రమైన పానిక్ అటాక్స్ వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. గతంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల వల్ల కలిగిన తీవ్రమైన ట్రామాతో బాధపడుతున్నాను. చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడుకోవడానికి నాకు మీ అందరి సహాయం కావాలి" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తాను థెరపీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

. "ఉమెన్స్ వాయిస్ వాళ్లను కూడా సంప్రదించాను కానీ లాభం లేకపోయింది. అండగా ఉంటామని సోషల్ మీడియాలో చాలా మంది డ్రామాలు ఆడుతారు. కానీ నిజానికి ఎవరికీ ఏమాత్రం పట్టదు. అసలు నేను ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక థెరపిస్ట్ దగ్గరకు వెళ్లాలో, లేక లాయర్ దగ్గరకు వెళ్లాలో కూడా అర్థం కావడం లేదు. సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు" అని తన వేదనను పంచుకున్నారు. అయితే, ఏమైందో తెలియదు కానీ వీడియోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే గాయత్రి దాన్ని తన అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. అయినప్పటికీ, ఆ వీడియోను చూసిన ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు తగిన కౌన్సిలింగ్ అందించి ఆదుకోవాలని, ఆమె త్వరగా ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలని కోరుకుంటూ మద్దతుగా నిలుస్తున్నారు.

Published : 
  • 25 June 2026, 9:59 AM IST