పడిక్కల్ పై ఆర్సీబీ డైరెక్టర్… ప్రశంసలు ఫ్యూచర్ కెప్టెన్ అతడేనా ?

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 15 ఇన్నింగ్స్‌ల్లో 464 పరుగులు చేసి జట్టు

Post Published By: dialnews
Updated : 27 June 2026, 7:50 PM IST

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 15 ఇన్నింగ్స్‌ల్లో 464 పరుగులు చేసి జట్టు విజయాల్లో ప్రధాన భూమిక పోషించాడు. 168.72 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడిన అతడు పవర్‌ప్లే అనంతరం కూడా పరుగుల వేగం తగ్గకుండా ఆర్‌సీబీకి బలమైన స్కోర్లు అందించాడు. కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పడిక్కల్.. తిరిగి బెంగళూరు జట్టులో చేరిన తర్వాత తన పాత ఫామ్‌ను అందుకున్నాడు. బెంగళూరులోనే ఎక్కువ క్రికెట్ ఆడిన అతడు.. సొంత జట్టు తరఫున ఆత్మవిశ్వాసంతో ఆడుతూ తన సామర్థ్యాన్ని నిరూపించాడు. పడిక్కల్ ఆటతీరు మాత్రమే కాకుండా.. జట్టు కోసం నిస్వార్థంగా ఆడే తత్వం కూడా అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఆర్‌సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబాట్ మాట్లాడుతూ.. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అందించిన వేగాన్ని కొనసాగించే బాధ్యతను దేవదత్ పడిక్కల్‌కు అప్పగించామని తెలిపాడు. ఆ బాధ్యతను అతడు అద్భుతంగా నిర్వర్తించాడని ప్రశంసించాడు.అయితే మో బొబాట్ చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు ఆర్‌సీబీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పడిక్కల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా అభివర్ణిస్తూ.. అతనిలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాడు. దీంతో రజత్ పాటిదార్ తర్వాత ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతలు పడిక్కల్‌కు అప్పగించనుందని నెట్టింట చర్చ మొదలైంది. ప్రస్తుతం రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్‌సీబీ దూసుకుపోతోంది.

వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. అయినప్పటికీ పాటిదార్ కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన పడిక్కల్‌ను భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఐదు సీజన్లకు పైగా ఆర్‌సీబీ తరఫున ఆడిన అనుభవం కూడా అతనికి కలిసిరానుంది. ఆర్‌సీబీ మెంటర్, బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ కూడా పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ వ్యాఖ్యలతో దేవదత్ పడిక్కల్ కేవలం స్టార్ బ్యాటర్ మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఆర్‌సీబీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే ప్రధాన అభ్యర్థిగా కూడా మారాడనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రజత్ పాటిదార్ సారథ్యంలో విజయవంతంగా దూసుకుపోతున్న ఆర్‌సీబీ.. రానున్న సంవత్సరాల్లో పడిక్కల్‌ను కెప్టెన్‌గా తీర్చిదిద్దే ప్రణాళికను అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 2-3 ఏళ్లు మాత్రం ఆర్‌సీబీ సారథిగా పాటిదార్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Published : 
  • 27 June 2026, 7:50 PM IST