Top story: పవన్ మౌనం వెనుక వ్యూహం ఏమిటి? స్థానిక ఎన్నికల్లో వాటా కోసమేనా ఈ పంతం?

ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకో ప్రభుత్వంతో.... సీఎం చంద్రబాబుతో దూరం మెయింటైన్ చేస్తున్నారు. వరసగా క్యాబినెట్ మీటింగులకు గైర్ హాజరవుతున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు గవర్నర్

Post Published By: dialnews
Updated : 25 August 2026, 9:32 AM IST

ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకో ప్రభుత్వంతో.... సీఎం చంద్రబాబుతో దూరం మెయింటైన్ చేస్తున్నారు. వరసగా క్యాబినెట్ మీటింగులకు గైర్ హాజరవుతున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు గవర్నర్ ఇచ్చే అట్ హోమ్ కి కూడా డుమ్మా కొట్టారు. అమరావతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. వీటన్నిటికీ తన అనారోగ్యం, భుజానికి జరిగిన శాస్త్ర చికిత్స సాకుగా చూపిస్తున్నారు. టిడిపి పై... చంద్రబాబుపై తన అసంతృప్తిని తెలియజేయడానికి గైర్హాజర్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు పవన్. జనసేన, టిడిపి, బిజెపి లో పైకి ఎవరు ఇది మాట్లాడకపోయినా.... అంతర్గతంగా చర్చలు బాగా జరుగుతున్నాయి.

పవన్ అసంతృప్తికి నాలుగైదు ప్రధాన కారణాలు ఉన్నాయి.పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్... చీఫ్ మినిస్టర్ కి పంపిన కొన్ని ఫైల్స్, ఆమోదం పొందకుండా అక్కడే నిలిచిపోవడంపై పవన్ కినుక వహించారు. అయితే ఈ జాప్యం కు అసలు కారణం సీఎం దగ్గరికి వెళ్లిన ఫైల్స్.... విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశీలనకు వెళ్ళడం.ఆయన పరిశీలించిన తర్వాతే అవి చంద్రబాబు కి చేరుకోవడం అనే విషయం తెలిసి పవన్ రగిలిపోయారు. తనకు సంబంధం లేని శాఖల ఫైల్స్ లోకేష్ ఎలా చూస్తారు అంటూ ఆగ్రహించిన పవన్.... తన మౌనం ద్వారా ఆ విషయాన్ని సీఎం దృష్టిలో పెట్టారు.

రాజ్యసభ సీట్లు విషయంలోనూ జనసేన వాటా సీటు... ప్రకటించకుండా చర్చల పేరుతో జాప్యం చేయడం కూడా పవన్ కు ఆగ్రహం తెప్పించింది. అక్కడితో అయిపోలేదు... నాగబాబుకు ఎమ్మెల్సీ అయిన తర్వాత క్యాబినెట్ మంత్రిగా చోటు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది చేయకపోవడంతో పవన్ రగిలిపోతున్నారు. చివరికి రాష్ట్రంలో ఎన్నడూ లేని గ్రీనరీ పరిరక్షణ కమిటీ సృష్టించి దానికి చైర్మన్గా క్యాబినెట్ హోదా నాగబాబు నియమించారు. అసలు ఆ పదవికి క్యాబినెట్ హోదా అవసరమా..? అని జనం అంత నవ్వుకున్నారు కూడా.

అన్నిటికీ మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వాటా ఇప్పటివరకు ప్రకటించలేదు. స్థానిక సంస్థల్లో జనసేనకు ఎక్కువ షేర్ ఇస్తే భారీగా నష్టపోతామని టిడిపి నేతలు అంతా చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. స్థానికంగా జనసేనకు బలం లేదని, కొన్ని జిల్లాల్లో అయితే కార్యకర్తలు కూడా లేరని... కేవలం టిడిపి సంస్థాగత బలాన్ని, వాడుకొని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడుతుందని దానివల్ల కింది స్థాయిలో టిడిపి దెబ్బతింటుందని, కార్యకర్తలు నాయకులు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని అధిష్టానానికి రిపోర్టులు వస్తున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ పై జనసేన కార్యకర్తల నుంచి కూడా వత్తిడి ఉంది. కూటమి ప్రభుత్వం రావడానికి జనసేన కారణం అని.... అందువల్ల స్థానికంగా బలం పెంచుకోవాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాటా తీసుకొని పార్టీని కింది స్థాయి నుంచి నిర్మాణం చేయడం వీలవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రావలసిన స్థానాలు విషయంలో రాజీ పడొద్దు అంటూ కింది స్థాయి నాయకులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిసారి సర్దుకుపోవడం సాధ్యం కాదనే విషయాన్ని పవన్ కళ్యాణ్... తన మౌనం ద్వారా చంద్రబాబుకు చిన్న హెచ్చరిక పంపిస్తున్నారు. అనారోగ్యం... శాస్త్ర చికిత్స పేరుతో తరచూ క్యాబినెట్ మీటింగ్లకు గైర్హాజర్ అవడం తో పాటు.... ముఖ్యమైన సమావేశాలు కు కూడా దూరంగా ఉంటున్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నారని.... ఇప్పుడు డిమాండ్ చేసి లాక్కోకపోతే 2029 ఎన్నికల్లో ఇవే ఇరవై ఒక్క సీట్లతో సర్దుకుపోవాల్సి ఉంటుందని జనసేన నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద పవన్ మౌనం వెనుక... గైర్హాజరుల వెనక ఇంత కథ ఉంది.

 

 

Published : 
  • 25 August 2026, 9:32 AM IST