సంజూ శాంసన్ కు షాక్.. జింబాబ్వేతో సిరీస్ కు నో ఛాన్స్.!

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా పేలవఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అతడికి జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కలేదు.

Post Published By: dialnews
Updated : 8 July 2026, 9:50 PM IST

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా పేలవఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అతడికి జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కలేదు. సెలెక్టర్లు ఈ పర్యటన కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, అతడికి డిప్యూటీగా తిలక్ వర్మ ఎంపికయ్యారు.ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ కూడా సీనియర్ భారత జట్టు నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు. ఐపీఎల్‌ సహా, దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన ఈ పేసర్‌కు భారత జట్టు నుంచి పిలుపు అందింది. ఈ పేసర్ ఇంతకుముందు శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌లో ఇండియా ఏ తరఫున ఆడాడు.

ఇటీవలి ఆడిన మూడు మ్యాచ్‌లలో సంజూ శాంసన్ రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లలో విఫలమైన అతడు.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. దీంతో మూడో టీ20 నుంచి ప్లేయింగ్‌ లెవెన్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. టీమిండియా టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఫామ్ ఆదారంగా అతడిపై వేటు వేశారు. కాగా సంజూ శాంసన్‌ ఐపీఎల్ 2026కు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి, టీమిండియా టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్‌ను పట్టించుకోలేదు. సరైన టీమ్ కాంబినేషన్‌ కోసం రజత్ పాటిదార్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించినా.. అతను తమ పరిగణనలో లేడని స్పష్టం చేసింది. స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రాగా.. యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్, హర్ష్ దూబే తొలిసారి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికయ్యారు.

మరోవైపు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ పర్యటనకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరం కాగా.. అతని స్థానంలో శివమ్ దూబే‌ను ఎంపిక చేశారు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా జరిగే ఈ మూడు టీ20ల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది. తెలుగు తేజం తిలక్ వర్మ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా జింబాబ్వేతో మూడు టీ ట్వంటీలుజులై 23, 25, 26 తేదీల్లో జరగనున్నాయి.

Published : 
  • 8 July 2026, 9:50 PM IST