యస్తికా భాటియా సరికొత్త చరిత్ర.. లార్డ్స్ లో శతక్కొట్టిన భారత క్రికెటర్..!

భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా చరిత్ర సృష్టించింది. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఐకానిక్ లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది.

Post Published By: dialnews
Updated : 14 July 2026, 5:55 PM IST

భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా చరిత్ర సృష్టించింది. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఐకానిక్ లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏకైక టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో యస్తికా భాటియా 145 బంతుల్లో సెంచరీ సాధించింది. సెంచరీ పూర్తి చేసిన అనంతరం మైదానంలో మోకరిల్లిన ఆమె.. పిచ్‌ను నుదుటితో మొక్కుతూ కృతజ్ఞతను చాటుకుంది.కెరీర్‌లో యస్తికా భాటియాకు ఇదే తొలి టెస్ట్ సెంచరీ. ఫస్ట్ సెంచరీతో యస్తికా భాటియా లార్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తన పేరును లిఖించుకుంది.

యస్తికా భాటియా సెంచరీకి ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు. ఆమెకు స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చారు.ఈ సెంచరీతో యస్తికా భాటియా పరులు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. సౌరవ్ గంగూలీ తర్వాత లార్డ్స్ మైదానంలో సెంచరీ బాదిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచింది. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగానే టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన గంగూలీ.. 131 పరుగులు చేశాడు.మహిళా టెస్ట్ క్రికెట్‌లో మూడు లేదా నాలుగో ఇన్నింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఇప్పటి వరకు ఈ రికార్డ్ భారత మాజీ మహిళా క్రికెటర్ సంధ్యా అగర్వాల్‌పై ఉంది. 1985లో న్యూజిలాండ్‌పై ఆమె 98 పరుగులు చేసింది.

31 ఏళ్ల తర్వాత ఈ రికార్డ్‌ను యస్తికా భాటియా బద్దలు కొట్టింది.ఈ మ్యాచ్‌లో భారత్ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ 170 పరుగులకే కుప్పకూలింది. క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది.115 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 86.3 ఓవర్లలో 341 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. యస్తికా భాటియాతో పాటు స్మృతి మంధాన, రిచా ఘోష్ హాఫ్ సెంచరీలతో రాణించారు. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూమూడో రోజు ఆట ముగిసే సమయానికి 130 రన్స్ కు 6 వికెట్లు కోల్పోయింది.

Published : 
  • 14 July 2026, 5:55 PM IST