రాహుల్ ను ఆరో ప్లేస్ లో పంపిస్తావా ? గంభీర్ ను ఏకిపారేసిన క్రిష్ శ్రీకాంత్.!

టీమిండియా మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ భార‌త హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో కేఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మ‌రింత ఆరో స్థానంలో పంపించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Post Published By: dialnews
Updated : 22 July 2026, 6:10 PM IST

టీమిండియా మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ భార‌త హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో కేఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మ‌రింత ఆరో స్థానంలో పంపించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భారీ ల‌క్ష్యం క‌ళ్ల ముందు ఉన్న‌ప్పుడు రాహుల్ లాంటి టాప్ క్లాస్ బ్యాట‌ర్‌ను ఆరో స్థానంలో కాకుండా ఇషాన్ కిష‌న్ స్థానంలో పంపించి ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రాహుల్ క్రీజులోకి వ‌చ్చే స‌మ‌యానికి భార‌త్ విజ‌యానికి 36 బంతుల్లో 84 ప‌రుగులు కావాలి. కానీ రాహుల్ ఔటైతే ఆ త‌ర్వాత స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్లు ఎవ‌రూ లేర‌ని, దీంతో ఒత్తిడికి లోన‌య్యి వికెట్ స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.

ఇది ముమ్మాటికి గంభీర్ త‌ప్పిద‌మేన‌ని, కేఎల్ రాహుల్ ఏమైనా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చేవాడిలా క‌నిపిస్తున్నాడా అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే ఆలోచ‌న‌లేమితో వైభ‌వ్ సూర్య‌వంశీ, సంజూ శాంస‌న్ కెరీర్‌లు భ్ర‌ష్టు ప‌ట్టించిన గంభీర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ కెరీర్‌ను కూడా నాశనం చేయాలని చూస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిజానికి మూడో వ‌న్డేలో 387 ప‌రుగుల ఛేద‌న‌లో ఇంగ్లండ్‌కు బ‌ట్ల‌ర్‌లాగే ఆ స్థానంలో మ‌న‌కు కీ ప్లేయ‌ర్ ఉండాలన్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తే.. అప్పుడు నాలుగో స్థానంలో ఇషాన్ కిష‌న్‌కు బదులు కేఎల్ రాహుల్‌ను పంపించాల్సిందని అభిప్రాయపడ్డారు.

2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో కేఎల్ రాహుల్ ఎక్కువ‌గా ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌కు వ‌చ్చి కోహ్లితో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాలు నిర్మించాడనీ గుర్తు చేశారు. లార్డ్స్ లో కూడా అది జ‌రిగి ఉంటే టీమిండియా ప‌రిస్థితి వేరుగా ఉండేదేమోనని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇషాన్ కిష‌న్‌ను ఆరో స్థానంలో ఆడించ‌డం వ‌ల్ల మ‌రో ఉప‌యోగం కూడా ఉండేదనీ,. ఆఖ‌ర్లో ధాటిగా ఆడాల్సిన స‌మ‌యంలో అక్ష‌ర్ ప‌టేల్‌తో క‌లిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను నడిపించ‌గ‌ల‌డ‌ని పేర్కొన్నారు. 2023 వన్డే ప్రపంచక‌ప్‌లో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 452 పరుగులు బాదాడు. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ను ఎక్కువగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపుతున్నాడు.
అక్షర్ పటేల్‌ను అతని కంటే ముందుగా పంపే వ్యూహాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ అమలు చేస్తోంది. ఈ ప్రయోగం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫలితాన్ని ఇచ్చినా.. ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం తీవ్రంగా దెబ్బ కొట్టింది.

Published : 
  • 22 July 2026, 6:10 PM IST