బుడ్డోడికి ప్రమోషన్.. వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ..!

భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్ర మోషన్ దక్కింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్‌కు దేశవాళీ క్రికె ట్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టె న్‌గా వైభవ్ ఎంపికయ్యాడు.

Post Published By: dialnews
Updated : 1 August 2026, 10:32 AM IST

భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్ర మోషన్ దక్కింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్‌కు దేశవాళీ క్రికె ట్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టె న్‌గా వైభవ్ ఎంపికయ్యాడు. ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన ఈస్ట్ జోన్ జట్టు ను ప్రకటించారు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గానూ, వైభవ్ అతనికి డిప్యూటీగానూ వ్యవహరించనున్నాడు. టీమిండియాలో తిరిగి తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్న ఇషాన్ కిషన్‌కు, ఈ టోర్నీ ద్వారా తన కెప్టెన్సీ, బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించే అద్భుత అవకాశం దక్కింది. గతేడాది ఇషాన్ కిషన్ ఫైనల్‌లో హర్యానాను 69 పరుగుల భారీ తేడాతో ఓడించి.. జార్ఖండ్‌కు వారి మొదటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు.

అంతేకాకుండా ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026లోని మొదటి 7 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా నాయకత్వం వహించాడు.ఈ స్క్వాడ్ ప్రకటనలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం 15 ఏళ్ల యంగ్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా నియమించడమే. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, ఐపీఎల్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సూర్యవంశీకి ఇంత చిన్న వయసులోనే లీడర్‌షిప్ రోల్ ఇవ్వడం అతడి మెచ్యూరిటీపై సెలెక్టర్లకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. సీనియర్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

వైభవ్ సూర్యవంశీ దక్షిణాఫ్రికా పర్యటనలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి సిరీస్ విజయాన్ని అందించాడు. వైభవ్ తన కొత్త బాధ్యతను ఎలా నిర్వహిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈస్ట్ జోన్ జట్టులో భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కు మార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, అంకుల్ రాయ్, విరాట్ సింగ్ వంటి ప్లే యర్స్ చోటు దక్కించుకున్నారు. 2027 ప్రపంచ కప్ జట్టులో షమీకి చోటు దక్కాలనే డిమాండ్‌లు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ టోర్నీలో షమీ ప్రదర్శనను సెలక్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.దులీప్ ట్రోఫీ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వర కూ జరుగుతుంది. తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్‌తో తలపడుతుంది.

Published : 
  • 1 August 2026, 10:32 AM IST