ముగిసిన కామన్ వెల్త్ క్రీడాసంబరం.. అహ్మదాబాద్ లో 2030 గేమ్స్.!

గ్లాస్గో వేదికగా ఎంతో వైభవంగా సాగిన కామన్వెల్త్ గేమ్స్  నేటితో తెరపడింది.  11 రోజులుగా 74 దేశాలకు చెందిన అథ్లెట్లు పతకాల వేటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది.

Post Published By: dialnews
Updated : 3 August 2026, 6:45 PM IST

గ్లాస్గో వేదికగా ఎంతో వైభవంగా సాగిన కామన్వెల్త్ గేమ్స్  నేటితో తెరపడింది.  11 రోజులుగా 74 దేశాలకు చెందిన అథ్లెట్లు పతకాల వేటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. కాగా 2030లో  కామన్ వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం అయ్యి 2030 నాటికి వందేళ్లు పూర్తి అవుతాయి. దీంతో భారత్‌ కామన్వెల్త్‌ శతాబ్ది ఉత్సవాలకు భారత్‌ వేదిక కానుంది. మన దేశంలో రెండోసారి ఈ క్రీడలు జరగనున్నాయి. 2010లో ఢిల్లీ వేదికగా భారత్‌ మొదటి సారి కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ 2030లో కామన్వెల్త్‌ గేమ్స్‌ను అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనుంది.

2036 ఒలింపిక్స్ కోసం తన బిడ్‌ను బలోపేతం చేయడానికి ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌ను భారత్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొనుంది.2010 కామన్వెల్త్ క్రీడలను ఢిల్లీలో నిర్వహించినప్పుడు ప్రారంభంలో 16,000 కోట్లను నిర్వహణ వ్యయంగా అంచనా వేశారు. కానీ, క్రీడలు ముగిసే సమయానికి ఖర్చు 70,000 కోట్లకు చేరుకుంది.2030 క్రీడలను నిర్వహించడాన్ని ఒక క్రీడా కార్యక్రమంగా కాకుండా, దీర్ఘకాలిక జాతీయ పెట్టుబడిగా చూస్తోంది. ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత గేమ్స్ విలేజ్, స్టేడియం, విమానాశ్రయం, మెట్రో, రోడ్లు, అనేక ఇతర నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమం నుండి అహ్మదాబాద్‌లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.

కామన్వెల్త్‌ గేమ్స్‌తో పరోక్షంగా నగర భవిష్యత్తు మారిపోనుంది. భారత్‌తో పాటు నైజీరియా కూడా కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణకు ఆసక్తి చూపాయి. అయితే భారత్‌ ప్రతిపాదన గేమ్స్ ఫెడరేషన్ ప్రాధాన్యత ఇచ్చిన వివరాలు, ప్రణాళిక, వనరులు మెరుగ్గా ఉండటంతో ఫెడరేషన్‌ భారత్‌కు అవకాశం కల్పించింది. అయితే 2030లో జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌కు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్‌ ఆతిథ్యమివ్వనున్న 2030 కామన్వెల్త్‌ గేమ్స్ లో పోటీపడే క్రీడాంశాలను  ఖరారు చేశారు. మొత్తం 17 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Published : 
  • 3 August 2026, 6:45 PM IST