ఒకప్పుడు తన గ్లామర్, అభినయంతో బాలీవుడ్‌ను ఏలిన బ్యూటీ మల్లికా షెరావత్. సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలోనూ, రకరకాల షోలలోనూ పలకరిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వయసు 50 ఏళ్లకు చేరువవుతున్నా చెక్కుచెదరని అందంతో కుర్రకారును ఇప్పటికీ మెప్పిస్తున్న మల్లికా షెరావత్, ఇటీవల హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ది ట్రైటర్స్' సీజన్ 2 గ్రాండ్‌గా ప్రారంభమైంది. బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ఈ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 13 నుండి ఈ షో స్ట్రీమింగ్ అవుతుండటంతో, నిర్వాహకులు వరసబెట్టి ప్రామోలను విడుదల చేస్తున్నారు.
ఈ ప్రమోషనల్ వీడియోలలో ఒకదానిలో మల్లికా షెరావత్ తన తోటి కంటెస్టెంట్లతో మాట్లాడిన తీరు, చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.ఈ షోలో భాగంగా తోటి కంటెస్టెంట్ ఆదిత్య కులశ్రేష్ఠ మల్లికాను ప్రశ్నిస్తూ — "మీకు ఎవరిపైనా క్రష్ ఉందా? లేదా మీపై ఎవరికైనా క్రష్ ఉందా?" అని అడిగారు.దానికి మల్లికా షెరావత్ సమాధానమిస్తూ:"చాలామందికి నా మీద క్రష్ ఉంది.""హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్‌కి కూడా నాపై క్రష్ ఉండేది.""మేమిద్దరం కలిసి ప్రైవేట్ పార్టీలు చేసుకున్న సమయంలో తీసిన వీడియోలను టామ్ నాకే పంపించేవాడు అని సెలవిచ్చింది.ఈ మాటలు వినగానే అక్కడున్న తోటి పోటీదారులు మరియు నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
మల్లికా చేసిన ఈ వ్యాఖ్యలపై తోటి కంటెస్టెంట్లు "అది ఏ రకమైన వీడియోలు?" అని ప్రశ్నించగా.. "మేమంతా కలిసి ఫ్రెండ్లీగా పార్టీలు చేసుకున్నప్పుడు తీసిన సాదాసీదా వీడియోలనే టామ్ పంపేవాడు" అని మల్లికా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా, టామ్ క్రూజ్ చాలా అద్భుతమైన వ్యక్తని కొనియాడారు.ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మల్లికా షెరావత్ చేసిన ఈ 'టామ్ క్రూజ్ క్రష్' కామెంట్లు కేవలం షోకి మైలేజ్ పెంచడానికేనా లేక నిజంగానే వారి మధ్య ఫ్రెండ్షిప్ ఉందా అనేది పక్కన పెడితే.. 'ది ట్రైటర్స్' ప్రోమో మాత్రం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.