Mega158 బాస్‌ రెడీ!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అందించే ప్రత్యేక కానుకగా #Mega158 సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏటా ఆగస్టు 22న చిరంజీవి జన్మదినాన్ని టాలీవుడ్‌

Post Published By: dialnews
Updated : 22 August 2026, 10:54 AM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అందించే ప్రత్యేక కానుకగా #Mega158 సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏటా ఆగస్టు 22న చిరంజీవి జన్మదినాన్ని టాలీవుడ్‌లో ఒక పండగలా జరుపుకుంటారు. ఈ సారి ఆ వేడుకలను మరింత రెట్టింపు చేస్తూ, ఈ భారీ చిత్రం నుంచి అధికారిక టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హంగామా మొదలైంది.ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొనడానికి ప్రధాన కారణం దీని కాంబినేషనే.

దర్శకుడు బాబీ కొల్లి మరియు మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించి సంచలన విజయం నమోదే చేసింది. వింటేజ్ చిరంజీవి మాస్ స్వాగ్, టైమింగ్‌ను బాబీ చూపించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో చిరంజీవి ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ సిల్హౌట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నారు.ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని స్పష్టం చేశారు.

“A New Avatar. A New Attitude. A Whole New Side Of Megastar” అనే క్యాప్షన్‌తో, చిరంజీవిని ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక సరికొత్త మేనరిజం మరియు క్యారెక్టరైజేషన్‌లో చూపించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ సినిమాకు ‘బ్లడీ బెంచ్ మార్క్’అనే పవర్‌ఫుల్ టాగ్ లైన్‌ను ఖరారు చేయడం ద్వారా ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చారు. ఆగస్టు 22న రాబోతున్న టైటిల్ గ్లింప్స్‌లో సినిమా అసలు పేరుతో పాటు, కథా నేపథ్యం మరియు చిరంజీవి సరికొత్త లుక్‌ను పరిచయం చేయనున్నారు. బాబీ మేకింగ్ స్టైల్, కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీతనం, చిరంజీవి తిరుగులేని మాస్ ఇమేజ్ అంతా కలసి ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద మరొక బెంచ్‌మార్క్‌గా నిలబెడతాయని భావిస్తున్నారు. ఈ సర్‌ప్రైజ్ గ్లింప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Published : 
  • 22 August 2026, 10:54 AM IST