Viveka’s wife Saubhagyamma’ : ఇంత దిగజారిపోయావా జగన్ ? వివేకా భర్య సౌభాగ్యమ్మ కన్నీటి లేఖ

వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు... ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా... రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్ మోహన రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయునది...

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 April 2024, 1:11 PM IST

వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు... ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా... రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్ మోహన రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయునది...

2009లో మీ తండ్రిని కోల్పోయినప్పుడు నీవు ఎంత మనోవేదన అనుభవించావో... 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే ఆవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇంత వరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన విషయం... మన కుటుబంలోని వారే హత్యకు కారకులు కావడం... హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం...
నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈవిధంగా... నీ పత్రిక, నీ టీవీ చానెల్, నీ సోషల్ మీడియా.. నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో ... మాటల్లో చెప్పలేనంత విధంగా హననం చేయడం, చేయించడం ఇది మీకు తగునా ?

న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ...నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే...నీకు మాత్రం పట్టడం లేదా ?
సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే... నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటి ?

కుటుంబ సభ్యుడిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం ? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన వారికి మరలా ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని నీవు కల్పించడం...ఇది సమంజసమా ?
ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నాను.

హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున ... చివరి ప్రయత్నంగా...న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయమని...నిన్ను అర్థిస్తున్నాను.
రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని... ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా.... న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నాను.

ఇట్లు
నీ చిన్నమ్మ
సౌభాగ్య

 

Published : 
  • 25 April 2024, 1:11 PM IST