బ్రేకింగ్: కల్తీ పాలు.. నలుగురు మృతి..!

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం సంచలనంగా మారింది. కల్తీ పాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. రాజమండ్రి లాల చెరువులో కల్తీ పాలు కలకలం రేపాయి

Post Published By: dialnews
Updated : 23 February 2026, 11:51 AM IST

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం సంచలనంగా మారింది. కల్తీ పాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. రాజమండ్రి లాల చెరువులో కల్తీ పాలు కలకలం రేపాయి. కల్తీ పాలు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు చౌడేశ్వరి నగర్ , స్వరూప్ నగర్ చెందిన పలువురు. పలువురికి అన్యూరియా, డయేరియా, కిడ్నీలు డ్యామేజ్ కావడంతో తీవ్ర అస్వస్థత ఏర్పడింది.

రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స తీసుకుంటున్నారు. అటు కల్తీ పాలతో చిన్నారులు కూడా అనారోగ్యం పాలయ్యారు. పాలు సరఫరా చేసిన కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేష్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Published : 
  • 23 February 2026, 11:51 AM IST