ఫ్యామిలీతో సహా మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పరారీ..!

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భారీ భూకబ్జా పాల్పడి అరెస్ట్‌ భయంతో కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికి రాత్రే పారిపోయారు. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులకు సిద్ధం కావడంతో.. భార్య, కొడుకు

Post Published By: dialnews
Updated : 22 July 2026, 5:51 PM IST

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భారీ భూకబ్జా పాల్పడి అరెస్ట్‌ భయంతో కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికి రాత్రే పారిపోయారు. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులకు సిద్ధం కావడంతో.. భార్య, కొడుకుతో కలిసి అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా సీతారాం పరారీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. శ్రీకాకుళం లోని బలగ ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 35/13లో.. సుమారు 3 నుంచి 4 కోట్ల ఖరీదైన భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన తమ్మినేని కుటుంబం, దాన్ని అక్రమంగా దక్కించుకునేందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం భారీ కుట్రకు తెరతీసింది. ఆ భూమికి సంబంధించి అసలు యజమాని ఇంకా బతికే ఉన్నారు. కానీ, ఆయన చనిపోయినట్టు అధికారులు కళ్లుగప్పి నకిలీ డెత్‌ సర్టిఫికేట్‌ సృష్టించారు. ఆ తర్వాత ఒడిశాకు చెందిన రజనీ అనే మహిళను తీసుకువచ్చి.. ఆమెనే గోవిందరాజులు కూతురు 'అంధవరపు రజనీ'గా కట్టు కథ క్రియేట్‌ చేశారు. ఆమెనే ఆ భూమికి ఏకైక వారసురాలిగా చూపిస్తూ, ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కొడుకు నాగ్‌ పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు.

రీసెంట్‌గా ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించేందుకు యత్నించగా, అసలు యజమాని కుటుంబ సభ్యులు అడ్డుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో నకిలీ డెత్‌ సర్టిఫికేట్లు, దొంగ వారసత్వం, తప్పుడు రిజిస్ట్రేషన్ల బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ భూకబ్జా వ్యవహారం వెనుక నేరుగా తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి ఉన్నట్టు శ్రీకాకుళం పోలీసులు ఆధారాలతో సహా నిర్ధారించారు. నకిలీ వారసురాలిగా నటించిన రజనితో పాటు దొంగ రిజిస్ట్రేషన్లకు సహకరించిన 13 మందిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ బాగోతంలో అక్రమాలకు సహకరించిన హిరమండలం సబ్‌-రిజిస్ట్రార్‌ బొడ్డేపల్లి అరుణ కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. నకిలీ వారసురాలు రజనీ, సతీష్ కుమార్ కలిపి మొత్తం 8 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తమ్మినేని, ఆయన భార్య వాణి, కొడుకు నాగ్‌, సబ్ రిజిస్ట్రార్‌పై దర్యాప్తును వేగవంతం చేశారు.

తన ప్రధాన అనుచరులు, మధ్యవర్తులు అరెస్ట్ కావడంతో.. ఇక ఏ క్షణంలోనైనా పోలీసులు తమను అరెస్ట్ చేస్తారని తమ్మినేని సీతారాం ఫ్యామిలీ గ్రహించారు. దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఫ్యామిలీ మొత్తం ఆమదాలవలసలోని తమ అద్దె ఇంటి నుంచి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అత్యంత రహస్యంగా పారిపోయారు. పోలీసులు టవర్ లొకేషన్ ద్వారా తమను పసిగట్టకుండా ఉండేందుకు చాలా తెలివిగా తమ స్మార్ట్ ఫోన్లను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. అలాగే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్న తమ సొంత కార్లను వాడకుండా, బయట నుంచి ఓ ప్రైవేటు ఇన్నోవా కారును తెప్పించుకుని అందులో రాత్రికి రాత్రే పరారైనట్లు సమాచారం. గతంలో కూడా తమ్మినేనిపై పలు కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఆమదాలవలస టీఎస్‌ఆర్ కాలేజీ పక్కన ఉన్న 8 సెంట్ల స్థలాన్ని ఆక్రమించగా, రీసెంట్‌గా అధికారులు దాన్ని విడిపించి బాధితులకు అప్పగించారు. అలాగే ఓ కానిస్టేబుల్ భార్యను బెదిరించి రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటిని ఆక్రమించారనే ఫిర్యాదులు కూడా సీతారాం మీద ఉన్నాయి. స్పీకర్‌ స్థాయిలో పని చేసిన వ్యక్తి ఇలాంటి పనులు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Published : 
  • 22 July 2026, 5:51 PM IST