ఫస్ట్ నైట్ ఇలాగేనా జరిగేది?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సీతాలక్ష్మి. ముఖ్యంగా 'కార్తీక దీపం' సీరియల్‌లో 'సుమిత్ర' పాత్రతో ఆమె ఇంటింటికీ దగ్గరయ్యారు.

Post Published By: dialnews
Updated : 15 May 2026, 7:50 PM IST

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సీతాలక్ష్మి. ముఖ్యంగా 'కార్తీక దీపం' సీరియల్‌లో 'సుమిత్ర' పాత్రతో ఆమె ఇంటింటికీ దగ్గరయ్యారు. వెండితెరపై, బుల్లితెరపై ఎంతో ప్రశాంతంగా, బాధ్యతగల పాత్రల్లో కనిపించే సీత నిజ జీవితం మాత్రం అంత ప్రశాంతంగా లేదని ఆమె తాజా ఇంటర్వ్యూతో వెల్లడైంది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన వైవాహిక జీవితంలోని చీకటి కోణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. ముఖ్యంగా తొలిరాత్రి గురించి ఎన్నో కలలు కంటారు. కానీ సీతాలక్ష్మి జీవితంలో మాత్రం అది ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది. "అందరికీ అది హ్యాపీ నైట్.. కానీ నాకు మాత్రం సాడ్ నైట్" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయిన మొదటి రోజు నుంచే తన భర్త ప్రవర్తన చాలా కఠినంగా ఉండేదని, అనవసరంగా తిట్టడం, కొట్టడం వంటివి చేసేవారని ఆమె వెల్లడించారు. ఆ మొదటి రోజే తన భర్తపై తనకు అనుమానాలు మొదలయ్యాయని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

వివాహం తర్వాత వారి మధ్య ఆర్థిక పరమైన విభేదాలు కూడా తలెత్తాయి. "ఆయన చెప్పింది తప్పు కాదు.. కానీ చెప్పిన విధానం తప్పు" అని సీత పేర్కొన్నారు. భర్త పట్ల ఆమెకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ప్రవర్తన వల్ల తనను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారనే భావన కలిగిందని ఆమె తెలిపారు. మొదటి నుంచి ఒత్తిడి, కోపం ప్రదర్శించడం వల్ల సంబంధం దెబ్బతిన్నట్లు ఆమె వివరించారు.
సీత తన సంపాదన మొత్తాన్ని తల్లికి, తన కుటుంబానికి ఇచ్చేసేవారట. "నాకంటూ సొంత ఇల్లు కూడా లేదు.. సంపాదించిందంతా ఇంటికే ఇచ్చా" అంటూ ఆ ఇంటర్వ్యూలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి సమయంలో కూడా ఇంటిని కుటుంబ సభ్యుల పేరు మీద ఉంచుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని, అయితే ఆ నిర్ణయాల వల్ల చివరకు తానే నష్టపోయానని ఆమె అంగీకరించారు. కేవలం వ్యక్తిగత జీవితమే కాదు, వృత్తిపరంగా కూడా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని సీత తెలిపారు.

సినిమాల్లో, సీరియల్స్‌లో పనిచేస్తున్న సమయంలో ఇండస్ట్రీలోని రాజకీయాలు, ఈర్ష్యలు తనను ఎంతగానో ఇబ్బంది పెట్టాయని వెల్లడించారు. "ముందు బాగానే మాట్లాడి వెనుక పుల్లలు పెడతారు.. ఇక్కడ నిజమైన ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరు" అంటూ ఇండస్ట్రీలోని చేదు నిజాలను ఆమె బయటపెట్టారు. చిన్నప్పటి నుంచి తాను ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.సీతాలక్ష్మి పంచుకున్న ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెరపై ఎంతో ధైర్యంగా కనిపించే నటి వెనుక ఇంతటి వేదన ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ధైర్యం చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Published : 
  • 15 May 2026, 7:50 PM IST