Divi Vadthya: కాబోయేవాడు ఎలా ఉండాలంటే.. ఆ క్వాలిటీ తప్పనిసరి.. దివి వడ్త్యా ఏం చెప్పిందంటే

జోర్దార్ సుజాతతో జరిగిన ఇంటర్వ్యూలో దివి వడ్త్యా.. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా దివికి కాబోయే భర్త ఎలా ఉండాలంటూ ప్రశ్నించింది జోర్దార్ సుజాత.

Post Published By: narender Thiru
Updated : 21 February 2024, 8:47 PM IST

Divi Vadthya: బిగ్‌బాస్ షోతోపాటు, సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి దివి వడ్త్యా. ప్రస్తుతం సినిమాలతోపాటు, వెబ్ సిరీస్‌లలో కూడా కనిపిస్తోంది. తాజాగా డయల్ న్యూస్‌ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. జోర్దార్ సుజాతతో జరిగిన ఇంటర్వ్యూలో దివి వడ్త్యా.. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

PALLAVI PRASANTH: పల్లవి ప్రశాంత్‌కు గుడ్‌న్యూస్‌.. కోర్టు తాజా ఆదేశాలేంటంటే..

ఈ సందర్భంగా దివికి కాబోయే భర్త ఎలా ఉండాలంటూ ప్రశ్నించింది జోర్దార్ సుజాత. తనకు కాబోయే వాడికి వంట చేయడం వచ్చుండాలంటూ చెప్పింది దివి. "నాకు సరైన పార్ట్‌నర్ దొరికితేనే పెళ్లి చేసుకుంటా. ఒకప్పుడైతే కాబోయే అబ్బాయంటే ఆజానుబాహుడై ఉండాలి. మజిల్స్, సిక్స్‌ ప్యాక్స్, మంచి జుట్టు, మంచి స్మైల్, డింపుల్‌తో హ్యాండ్సమ్‌గా ఉండాలని ఆశించేదాన్ని. ఇప్పుడైతే మంచి అబ్బాయైతే చాలు. అర్థం చేసుకోవాలి. నాకు సపోర్టు చేయాలి. అన్ని రకాలుగా సాయం చేయాలి. అర్థం చేసుకోవాలి.

అయితే, వంట చేసే అబ్బాయైతే ఇంకా బెటర్ అనిపిస్తుంది. నేను ఫుడీ. వంట చేసి పెడితే కేరింగ్‌లా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం.. నాకన్నా కొంచెం హైట్ ఉండాలి. నేను అన్నింటికీ సర్దుకుపోతాను. కానీ, గౌరవం ఇవ్వాలి" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
https://youtu.be/bZO3uhKJFak

Published : 
  • 21 February 2024, 8:47 PM IST