అల్లు అర్జున్ హై స్పీడ్.. గ్యాప్ లేకుండా పాన్ ఇండియా లైనప్.. కాస్త జాగ్రత్త బన్నీ..!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన కెరీర్‌ ప్లానింగ్‌లో స్పీడ్ పెంచేశాడు.

Post Published By: dialnews
Updated : 3 February 2026, 3:50 PM IST

పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన కెరీర్‌ ప్లానింగ్‌లో స్పీడ్ పెంచేశాడు. ఒకప్పుడు ఆచితూచి సినిమాలు ఎంచుకునే బన్నీ.. ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అంటూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. పుష్ప 2 తర్వాత మరోసారి భారీ బ్రేక్ రావడంతో.. తన నెక్ట్స్ సినిమాల జాబితాను చాంతాడంత పెంచేసుకున్నాడు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత బన్నీ తన లైనప్‌లో ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు కమిట్ అయిన విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అట్లీ మేకింగ్ స్టైల్, బన్నీ ఎనర్జీ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. 600 కోట్లతో ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. బన్నీ మిగతా దర్శకులతో చర్చలు జరుపుతూ డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

మరోవైపు క్రేజీ కాంబినేషన్లు బన్నీ కోసం క్యూ కడుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బన్నీ.. మరోసారి ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే యానిమల్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగాతో ఓ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ అయ్యింది. ఇక విక్రమ్, లియో వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్‌తో కూడా బన్నీ సినిమా కన్ఫర్మ్ అయింది. దీనిపై కన్ఫర్మేషన్ వీడియో కూడా వచ్చింది. ఇలా ఒక్కో డైరెక్టర్ ఒక్కో జోనర్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నవాళ్లే కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా బన్నీతో సినిమా కోసం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ధురంధర్ లాంటి సినిమాలతో ఆదిత్య రేంజ్ మారిపోయింది. ఈయన కూడా బన్నీకి ఓ పవర్ ఫుల్ కథ వినిపించాడని తెలుస్తుంది. ఇది ఒక మైథలాజికల్ టచ్ ఉన్న యాక్షన్ డ్రామా అని, ఈ స్టోరీకి బన్నీ చాలా ఇంప్రెస్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. బన్నీ నేరుగా బాలీవుడ్ మార్కెట్‌పై మరో భారీ దండయాత్ర చేయడం ఖాయం. అశ్వత్థామ వంటి భారీ సబ్జెక్టులను హ్యాండిల్ చేయాలనుకున్న ఆదిత్య ధర్ విజన్ బన్నీకి బాగా కనెక్ట్ అయ్యిందని అంటున్నారు. మొత్తానికి చూస్తే అల్లు అర్జున్ డైరీలో ఖాళీ పేజీలే కనిపించడం లేదు. ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో చిన్నపాటి సస్పెన్స్ ఉన్నప్పటికీ.. బన్నీ మాత్రం రాబోయే మూడేళ్ల పాటు ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. స్టార్ డైరెక్టర్లు, భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ ప్లానింగ్‌తో బన్నీ కెరీర్ పీక్స్‌లో ఉందనే చెప్పాలి. ఇక ఈ లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి ఐకాన్ స్టార్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది.

Published : 
  • 3 February 2026, 3:50 PM IST