పుష్ప-2 రిలీజ్ డేట్‌ను మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కథలో చాలా మార్పులు చేసిన కారణంగా సినిమా రిలీజ్ డేట్ పొడిగించినట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి పార్ట్‌కు ఆడియన్స్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.
