తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. మన కథలు, మన సంస్కృతి, మన దైవత్వం కలగలిసిన చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా 'కార్తికేయ-2', 'హనుమాన్' వంటి చిత్రాలు కమర్షియల్ సక్సెస్‌తో పాటు భారతీయ సనాతన ధర్మాన్ని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాయి. ఇప్పుడు అదే బాటలో మరో భారీ బడ్జెట్ విజువల్ వండర్ మన ముందుకు రాబోతోంది. అదే "నాగబంధం". అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్ ప్రకారం, ‘నాగబంధం’ చిత్రం 2026, జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. "ఎక్స్‌పీరియన్స్ ది గ్రాండ్యూర్ ఆఫ్ ఏ విజువల్ స్పెక్టాకిల్ ఆన్ బిగ్ స్క్రీన్స్" అంటూ మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు.
పోస్టర్ లోజటాజూటం, ఒంటి నిండా విభూతి రేఖలు, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉన్న ఒక పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ పోస్టర్‌లో హైలైట్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ సర్పాలు మరియు పురాతన ఆలయ శిల్పకళ కనిపిస్తోంది. ఇది సినిమాలో ఆధ్యాత్మిక కోణాన్ని సూచిస్తోంది. మరోవైపు, స్టైలిష్ కోటు ధరించి, చేతిలో ఒక మాస్క్ పట్టుకుని ఉన్న యువకుడు కనిపిస్తున్నాడు. ఇది ఒక ట్రెజర్ హంట్ లేదా ఒక మిస్టరీ థ్రిల్లర్ ఎలిమెంట్‌ను గుర్తుచేస్తోంది. ఈ రెండు షేడ్స్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు 'నాగబంధం' అంటే ఏమిటి? అనేది ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. ఈ సినిమా ట్యాగ్ లైన్ "The Secret Treasure". అంటే ఏదో ఒక రహస్యమైన నిధి చుట్టూ ఈ కథ తిరగబోతోందని స్పష్టమవుతోంది. మన పురాణాల్లో నాగలోకం, నాగుపాము కాపలా ఉండే నిధుల గురించి అనేక కథలు ఉన్నాయి. అభిషేక్ నామ ఈ చిత్రంలో అడ్వెంచర్, ఫాంటసీ మరియు డివైన్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నట్లు సమాచారం.
ముఖ్యంగా గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండబోతోందని తెలుస్తోంది. పోస్టర్‌లో కనిపిస్తున్న డీటెయిలింగ్ చూస్తుంటే, ఒక భారీ ప్రపంచాన్ని మేకర్స్ సృష్టించినట్లు అర్థమవుతోంది.గత కొన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకులు కేవలం కమర్షియల్ మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, కథలో కొత్తదనం ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు. 'కాంతార', 'కార్తికేయ-2', 'హనుమాన్' వంటి సినిమాల సక్సెస్ అదే నిరూపించింది. 'నాగబంధం' కూడా అదే కోవలోకి వచ్చే సినిమా అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.నిధి అన్వేషణ, ఆధ్యాత్మిక రహస్యాలు, గ్రాండియర్ విజువల్స్.. ఇవన్నీ కలిస్తే సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా 'బిగ్ స్క్రీన్' ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి 'నాగబంధం' పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. 2026 సమ్మర్ తర్వాత జూలైలో రాబోతున్న ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.