Prashanth Neel : ప్రశాంత్ నీల్ కళ్ళు నెత్తికెక్కాయా..?

ఒకవైపు రెబెల్ స్టార్ ప్రభాస్, మరో వైపు కేజీఎఫ్ సినిమాతో సత్తా చాటిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇంపార్టెంట్ రోల్ లో మలయాళం హీరో పృథ్వి రాజ్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 December 2023, 4:52 PM IST

 

ఒకవైపు రెబెల్ స్టార్ ప్రభాస్, మరో వైపు కేజీఎఫ్ సినిమాతో సత్తా చాటిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇంపార్టెంట్ రోల్ లో మలయాళం హీరో పృథ్వి రాజ్. ఒక సినిమాపై అంచనాలను పెంచడానికి ఇంతకన్నా స్టఫ్ ఇంకేం కావాలి. బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి ఇంతకు మించిన స్టార్ కాస్ట్ ఏముంటుంది. ఇంతవరకు నిజమే కానీ, సినిమా విడుదల దగ్గరవుతున్నా కూడా, సరైన ప్రచారాలు లేక అభిమానులు తీవ్రస్థాయిలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా ఇంకా విడుదల చేయలేదు. ట్రైలర్ తప్ప సలార్ గురించి మరే అప్డేట్ కానీ, మరో ప్రమోషన్ కానీ అభిమానులు నోచుకోలేదు. ఎంత భారీ చిత్రానికైనా ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా మీద ఎంత హైప్ క్రియేట్ చేస్తే, అంత బిజినెస్ జరుగుతుంది. కానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ కానీ, ప్రొడక్షన్ టీమ్ కానీ అసలు సలార్ ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలే చేయట్లేదు. పట్టుమని ఇంకో పది రోజులు కూడా సినిమా విడుదలకు సమయం లేదు. రెండు పార్ట్లుగా వస్తున్న సలార్ కు సంబంధించి, పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి వాటిని దర్శకుడు ఏ విధంగా రీచ్ అవుతాడో అని, ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Published : 
  • 13 December 2023, 4:52 PM IST