Guntur Karam : గుంటూరు కారంలో డింపుల్ ..!

డింపుల్ హయతి.. ఈ పేరు చెప్తే కుర్రకారు మొత్తానికి చెమటలు పట్టాల్సిందే. ఎందుకంటే రవితేజ హీరోగా వచ్చిన రావణాసురలో బ్యూటీ ప్రదర్శించిన అందాలని అంత త్వరగా వాళ్ళు మర్చిపోలేరు. ఆ తర్వాత గోపీచంద్ సరసన రామబాణం లో కూడా నటించి ఇక తన కోసం అయినా ప్రేక్షకులు థియేటర్ల కి వచ్చేలా చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 December 2023, 1:30 PM IST

డింపుల్ హయతి.. ఈ పేరు చెప్తే కుర్రకారు మొత్తానికి చెమటలు పట్టాల్సిందే. ఎందుకంటే రవితేజ హీరోగా వచ్చిన రావణాసురలో బ్యూటీ ప్రదర్శించిన అందాలని అంత త్వరగా వాళ్ళు మర్చిపోలేరు. ఆ తర్వాత గోపీచంద్ సరసన రామబాణం లో కూడా నటించి ఇక తన కోసం అయినా ప్రేక్షకులు థియేటర్ల కి వచ్చేలా చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

మహేష్ లేటెస్ట్ మూవీ గుంటూరు కారంలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ లో డింపుల్ హయతి తన అంద చందాలని ప్రదర్శించబోతుంది. అలాగే స్వతహాగా మంచి డాన్సర్ అయిన డింపుల్ మహేష్ తో కలిసి ఎలా స్టెప్పులు వేస్తుందో అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఉవ్విళ్లూరుతున్నారు. అసలు ముందుగా ఆ సాంగ్ లో పూజా హెగ్డే చేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో డింపుల్ అవకాశాన్ని పొందింది. మహేష్ లాంటి సూపర్ స్టార్ పక్కన డాన్స్ చేసే అవకాశాన్ని పొందటం నిజంగా డింపుల్ అదృష్టమే అని చెప్పవచ్చు. పైగా ఈ అవకాశం ఆమె సినీ కెరీర్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది.

ఇదిలా ఉంటే బాబీ బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న NBK 109 లో ఐటం సాంగ్ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. బాబీ సెంటిమెంట్ ప్రకారం స్పెషల్ సాంగ్ ను పెట్టాలనుకుంటున్నాడట. అయితే ఈ సాంగ్ కోసం తమన్నా ను అనుకున్నారట. అయితే రెమ్యునరేషన్ భారీగా డిమాడ్ చేయడంతో డింపుల్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇక గతంలో డింపుల్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రంలో జర్ర జర్ర అనే ఐటెం సాంగ్ లో సూపర్ గా డాన్స్ వేసి అందర్నీ మెప్పించింది.

Published : 
  • 25 December 2023, 1:30 PM IST