Ram charan : చరణ్ విషయంలో జపాన్ మహిళ చేసిన పనికి అందరు షాక్

మెగా పవర్ స్టార్ (Mega Power Star) నుంచి గ్లోబల్ స్టార్ (Global Star) కి ట్రాన్స్ ఫామ్ అయిన హీరో రామ్ చరణ్ (Ram Charan). అయన అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 March 2024, 1:39 PM IST

మెగా పవర్ స్టార్ (Mega Power Star) నుంచి గ్లోబల్ స్టార్ (Global Star) కి ట్రాన్స్ ఫామ్ అయిన హీరో రామ్ చరణ్ (Ram Charan). అయన అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్. చరణ్ బర్త్ డే సందర్భంగా ఆ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. జరగండి అనే లిరిక్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఫ్యాన్స్ అయితే రిపీట్ గా వింటున్నారు. ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

చరణ్ కి ఉన్న అభిమానుల్లో లేడీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా కూడా ఆ ఆ సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనంగా జపాన్ కి చెందిన లేడీ అభిమాని జరగండి సాంగ్ సెలబ్రేషన్ ని చేసుకుంది. సాంగ్ లో ని చరణ్ గెటప్ తో ఉన్న కట్ అవుట్ ని ఏర్పాటు చేసి తనకున్న అభిమానాన్ని చాటుకుంది. చరణ్ బర్త్ డే వేడుకులని కూడా జరిపించడం విశేషం.సోషల్ మీడియా లో ఆ పిక్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. పైగా జపాన్ భాషలో ట్వీట్ కూడా చేసింది. ఆ మహిళా అభిమాని పోస్ట్ ని గేమ్ చేంజర్ మేకర్స్ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ పట్ల ఎంతో ఆనందంగా ఉన్నారు.

ఇక గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ అవ్వగానే చరణ్ అభిమానుల్లో పండగ వాతావరణం ఏర్పడింది. చరణ్ ఇమేజ్ కి తగట్టుగా ఉండటంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సాంగ్ లో ఉన్న విజువల్ వండర్ కూడా వాళ్ళని ఎంతగానో ఆకట్టుకుంటుంది.b తమన్ సంగీతాన్ని అందించాడు. కియారా అద్వానీ చరణ్ కి జోడిగా చేస్తుంది. ఎస్ జె సూర్య, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Published : 
  • 30 March 2024, 1:39 PM IST