Allu. Arjun : పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్..

పుష్ప (Pushpa) సినిమా నుంచి స్టైలిష్ స్టార్‌ (Stylish Star) నుంచి ఐకాన్ స్టార్‌ (Icon Star) గా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). అలాగే పాన్ ఇండియా (Pan India) స్టార్ డమ్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 March 2024, 12:20 PM IST

పుష్ప (Pushpa) సినిమా నుంచి స్టైలిష్ స్టార్‌ (Stylish Star) నుంచి ఐకాన్ స్టార్‌ (Icon Star) గా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). అలాగే పాన్ ఇండియా (Pan India) స్టార్ డమ్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్‌లో అరుదైన గౌరవం అందుకున్నాడు

దుబాయ్‌ (Dubai) లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా దీనిని మార్చి 28న అంటే బన్నీ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి రిలీజ్ రోజున ఓపెనింగ్ చేశారు. ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ విగ్రహం అల వైకుంఠపురం (Ala Vaikunthapuram) లో సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ ధరించి పుష్ప మేనరిజంతో తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. అయితే అలాంటి కాస్ట్యూమ్‌నే ధరించి బన్నీ ఆ ఓపెనింగ్‌కి వెళ్లాడు. దీంతో తన ఫస్ట్ మూవీ రిలీజ్ రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ తెలిపాడు.

ఆ విగ్రహం ఓపెనింగ్ అనంతరం బన్నీ, ఆ విగ్రహం పక్కపక్కన నిల్చున్న ఫోజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో రియల్ బన్నీ ఎవరనేది పోల్చుకోవడానికి కాస్త సమయం పట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి.ఇకపోతే బన్నీ ప్రస్తుతం ‘పుష్ప2’ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కడంతో సెకండ్ పార్ట్‌ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 
  • 29 March 2024, 12:20 PM IST