సోషల్ మీడియాలో లీకులు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. ఒక సినిమా అనౌన్స్‌మెంట్ రాకముందే లుక్ టెస్ట్ ఫోటోలు, షూటింగ్ వీడియోలు బయటకు రావడం సర్వసాధారణం అయిపోయింది. కానీ #AA22 మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఛేదించడానికి వీలులేని ఒక రహస్యాల కోటలా మారింది. టెక్నాలజీ ఇంతగా పెరిగినా.. ప్రతి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ఈ రోజుల్లో కూడా, కనీసం చిన్న పుకారు కూడా షికారు చేయకుండా ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను ఇంతకాలం నడిపించడం నిజంగా అసాధారణం. షూటింగ్ మొదలై దాదాపు ఆరు నెలలు గడుస్తోంది. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా ఈ సమయానికి ఫస్ట్ లుక్ పోస్టరో, లేదా సెట్స్ నుండి లీక్ అయిన వర్కింగ్ స్టిల్సో బయటకు వస్తాయి. కానీ #AA22 విషయంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క అధికారిక ఫోటో లేదు.. చిన్న వీడియో క్లిప్ లేదు, అసలు కథ ఏ జానర్‌కు చెందిందో తెలిపే చిన్న హింట్ కూడా లేదు.
సెట్‌లో మొబైల్ ఫోన్ల నిషేధం నుండి.. యూనిట్ సభ్యుల వరకు పాటిస్తున్న కఠినమైన నిబంధనలు, మేకర్స్ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు, పక్కా ప్లానింగ్‌తో అమలు చేస్తున్న వ్యూహంలా కనిపిస్తోంది. దర్శకుడు, నిర్మాతలు కంటెంట్‌ను ఎంత భద్రంగా ఉంచాలనుకుంటున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆడియన్స్‌కు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ముందే తెలిసిపోతే కిక్ ఉండదని భావించి.. ప్రతి చిన్న విషయాన్ని దాచి ఉంచడం ద్వారా సినిమాపై ఆసక్తిని రోజురోజుకూ రెట్టింపు చేస్తున్నారు. ఈ స్థాయి సీక్రెసీ మెయింటైన్ చేయడం అంటే.. తెర వెనుక ఎంతటి పకడ్బందీ స్క్రిప్ట్ అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఉందో ఊహించుకోవచ్చు. సైలెన్స్ ఈజ్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటే నిశ్శబ్దం మాటల కంటే శక్తివంతమైనది అన్నట్లుగా.. AA22 ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఈ నిశ్శబ్దమే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
లీకులు లేకపోవడంతో అభిమానుల ఊహలకు హద్దులు లేకుండా పోయాయి. అది పీరియాడిక్ డ్రామానా? లేక విజువల్ వండరా? అని ఎవరికి వారు కొత్త థియరీలు అల్లుకుంటున్నారు. ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వకుండానే సినిమాపై ఇంతటి బజ్ క్రియేట్ చేయడం.. ట్రెండింగ్‌లో ఉంచడం కేవలం ఐకాన్ స్టార్ క్రేజ్‌కే సాధ్యం. చివరగా ఈ గోప్యత అంతా దేనికోసం..? అంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త, ఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికే అని స్పష్టమవుతోంది. కంటెంట్ ఏమాత్రం బయటకు రాకుండా ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే, బిగ్ స్క్రీన్ మీద ఏదో పెద్ద విస్ఫోటనం జరగబోతోందని అర్థం. ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం చాలా గట్టిగానే ఉండబోతోంది. బాక్సాఫీస్ వద్ద #AA22 సృష్టించబోయే రికార్డుల సునామీ కోసం అందరూ సిద్ధంగా ఉండాల్సిందే..!