రవితేజ ఇరుముడి సునామీ!

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్క బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం కేవలం 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్

Post Published By: dialnews
Updated : 3 September 2026, 12:55 PM IST

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్క బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం కేవలం 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, మొదటి వారంలోనే ఏకంగా 107 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించింది. సాధారణంగా ఏ సినిమాకైనా రెండో వారంలో కలెక్షన్స్ తగ్గుతాయి కానీ, దీనికి మాత్రం మొదటి వారం కంటే ఎక్కువే రావడం విశేషం.

ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో లాభాలను అందుకుంటోంది. ఈ రకమైన బాక్సాఫీస్ సునామీ చూస్తుంటే రవితేజ కెరీర్‌లో ఇది సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.గడిచిన 12 రోజుల్లో ఈ సినిమా మొత్తంగా 142 కోట్ల రూపాయల నెట్ మరియు 170 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 145.5 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం విశేషం.

ఇందులో నైజాంలో అత్యధికంగా 47 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 13.5 కోట్ల రూపాయలు రాబట్టింది. అలాగే కర్ణాటకలో 14 కోట్లు, తమిళనాడులో 2.5 కోట్లు, కేరళలో 20 లక్షలు మరియు ఇతర రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా మరియు నెల్లూరు జిల్లాలలో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొత్తానికి ఈ కలెక్షన్ల జోరు చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.

Published : 
  • 3 September 2026, 12:55 PM IST