బాక్సాఫీస్ ర్యాంపేజ్..!

ఈ రోజుల్లో థియేటర్‌కు జనాన్ని రప్పించడం అంటే మామూలు విషయం కాదు. కంటెంట్‌లో నిజంగా దమ్ముంటేనే ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫాంటసీ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’

Post Published By: dialnews
Updated : 27 July 2026, 2:48 PM IST

ఈ రోజుల్లో థియేటర్‌కు జనాన్ని రప్పించడం అంటే మామూలు విషయం కాదు. కంటెంట్‌లో నిజంగా దమ్ముంటేనే ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫాంటసీ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ విషయంలో.మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర నిజంగానే ‘ర్యాంపేజ్’ చూపిస్తోంది. సినిమా విడుదలైన రోజే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే అసలైన మ్యాజిక్ రెండో రోజు జరిగింది. మొదటి రోజు వచ్చిన మాౌత్ టాక్ చూసి జనాలు థియేటర్లకు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని విధంగా టిక్కెట్ల డిమాండ్ పెరిగిపోయింది. జనం రష్‌ను తట్టుకోలేక డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 300కి పైగా అదనపు షోలు యాడ్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో!యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కిరణ్ అబ్బవరం కథల ఎంపికలో వేగం పెంచడమే కాకుండా, విభిన్నమైన కాన్సెప్ట్‌లతో అలరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన శ్రీ గౌరి ప్రియా తన అందం, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ లవ్ స్టోరీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని టాక్. బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.

ఆయన అందించిన కొత్తదనంతో కూడిన ఫాంటసీ ప్రేమకథను దర్శకుడు రవి నంబూరి తెరపై ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ఫాంటసీ అంశాలకు ప్రేమని జోడించి చెప్పిన తీరు సీట్ అంచున కూర్చోబెడుతోంది. ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం. తన పాటలు, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.మాస్ మూవీ మేకర్స్ మరియు అమృత ప్రొడక్షన్స్ నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని ఎంతో రిచ్‌గా నిర్మించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అదనపు షోలతో ఈ సినిమా సందడి చేస్తోంది. వీకెండ్ కావడంతో ఈ అదనపు షోల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మంచి లవ్ అండ్ ఫాంటసీ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.

Published : 
  • 27 July 2026, 2:48 PM IST