మున్నాభాయ్ బాక్సాఫీస్ కూతరాంప్.!

క్రైమ్, మాఫియా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఓటీటీలో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అదే క్రేజ్‌తో ఇప్పుడు 'మీర్జాపూర్ ది మూవీ' రూపంలో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

Post Published By: dialnews
Updated : 7 September 2026, 9:22 PM IST

క్రైమ్, మాఫియా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఓటీటీలో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అదే క్రేజ్‌తో ఇప్పుడు 'మీర్జాపూర్ ది మూవీ' రూపంలో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. లాంగ్ వీకెండ్ మరియు కృష్ణాష్టమి సెలవులు కలిసిరావడంతో సినిమా కలెక్షన్స్ ఊహించని విధంగాపెరిగిపోతున్నాయి. ట్రేడ్ పండితులు సైతం ఈ రేంజ్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిత్రంలో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, జితేంద్ర కుమార్, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించి అదరగొట్టారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. నటీనటుల పారితోషికాలు, ప్రొడక్షన్ మరియు పబ్లిసిటీ ఖర్చులు అన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ దాదాపు 90 కోట్ల రూపాయలు అయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 58 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సినిమా క్లీన్ హిట్ గా నిలవాలంటే బాక్సాఫీస్ వద్ద 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉందని అంచనా వేశారు. ఇండియాలో తొలి రోజు ఈ సినిమా 25.75 కోట్ల రూపాయలు, రెండో రోజు 32 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

కేవలం భారత్‌లోనే మొదటి రెండు రోజుల్లో 57.75 కోట్ల రూపాయల నెట్, 69.30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మున్నా భయ్యా హవా స్పష్టంగా కనిపిస్తోంది. నార్త్ అమెరికాలో తొలి రోజు ఏకంగా 314 వేల డాలర్లు అంటే సుమారు 2.96 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గల్ఫ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నింటిలో కలిపి ఓవర్సీస్‌లో మొత్తం 10.25 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. భారత్ మరియు విదేశీ కలెక్షన్స్ అన్నీ కలుపుకుంటే ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 79.55 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించింది. వీకెండ్ కావడంతో మూడో రోజు కూడా కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఈ జోరు చూస్తుంటే కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మున్నా భయ్యా మరియు గ్యాంగ్ స్టర్ డ్రామాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఈ బాక్సాఫీస్ సునామీతో రాబోయే రోజుల్లో మీర్జాపూర్ మరిన్ని బిగ్గెస్ట్ రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

Published : 
  • 7 September 2026, 9:22 PM IST