తెలుగు చిత్రసీమలో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, స్వయంకృషితో 'న్యాచురల్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాని. ఈ రోజు టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నాని ప్రయాణం చాలామందికి ఆదర్శప్రాయం. ఈ స్థాయిలో నిలబడటానికి ఆయన పడిన కష్టం, చేసిన త్యాగాలు సామాన్యమైనవి కావు.టాలీవుడ్‌లో దర్శకత్వం వహించాలనే తపనతో ఎంతోమంది నిత్యం కష్టపడుతుంటారు. అలాగే నాని కూడా మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆయన ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఆఫీసుల్లో లేదా సినిమా సెట్స్‌లో పనిచేసే సిబ్బంది అంతా లంచ్ బ్రేక్ సమయంలో బయటకు వస్తుంటారు.
అయితే నాని ఆ సమయంలో బయటకు భోజనానికి వెళ్తే, సెట్స్‌లో కీలక వ్యక్తుల దృష్టిలో పడే అవకాశం కోల్పోతానని భావించారు.
అందుకే ఆయన లంచ్ చేయడం పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 9 నెలల నుండి సంవత్సరంన్నర పాటు మధ్యాహ్నం భోజనం చేయకుండా ఆఫీస్, సెట్‌లోనే వేచి చూశారు. ఆ విధంగా నాని పడిన ఆరాటం, చూపిన అంకితభావాన్ని గమనించిన దర్శకులు, నిర్మాతలు "ఇక ఈ కుర్రాడిని వదిలేలా లేము" అని భావించి, ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని, ఆ తర్వాత 'అష్టా చెమ్మా' సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు.
తన మొదటి సినిమాతోనే సూపర్‌హిట్ అందుకొని ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మొదటి సినిమా విజయవంతమైన తర్వాత, బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన 'ది ప్యారడైజ్' అనే చిత్రంలో నటిస్తున్నారు.తన లక్ష్యం కోసం ఆహారాన్ని కూడా పక్కనబెట్టి నిరంతరం కష్టపడిన నాని కథ, చలనచిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.