నిత్య మీనన్ పాన్ ఇండియా ఫాంటసీ.!

నటి నిత్య మేనన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన 'కేయూరి ప్రొడక్షన్స్'ను ఇటీవలే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె డీకే, విక్రమ్ కుమార్‌తో కలిసి ఒక ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ ద్వారా నిర్మాతగా మొదటి అడుగు వేస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 3 September 2026, 5:53 PM IST

నటి నిత్య మేనన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన 'కేయూరి ప్రొడక్షన్స్'ను ఇటీవలే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె డీకే, విక్రమ్ కుమార్‌తో కలిసి ఒక ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ ద్వారా నిర్మాతగా మొదటి అడుగు వేస్తున్నారు. గతంలో విజయవంతమైన చిత్రాలు తీసిన లియో విజన్ మరియు కేయూరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా 'ప్రొడక్షన్ నెం. 5' పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో నిత్య మేనన్ ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అభిమానులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచనుందని చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా వెల్లడించింది.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు టీజర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
వైవిధ్యభూరితమైన కదాంశంతో రూపొందుతున్న ఈ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారని మేకర్స్ ఎంతో నమ్మకంగా తెలియజేశారు. ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. సాధారణ ప్రేక్షకులకు కూడా భిన్నమైన వినోదాన్ని అందించేలా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మొదటిసారిగా నిత్య మేనన్ నిర్మాతగా మారుతుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో రానున్న ఈ అప్‌డేట్స్ కోసం సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Published : 
  • 3 September 2026, 5:53 PM IST