NTR ఇమేజ్.. ఆ కథలని ఎప్పుడో దాటేసిందా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా కథలను మించిపోయాడా? అంటే కొన్ని కథలకి తను సూట్ అయినా.. అవి తనకి సూట్ కాని స్టేజ్ కి తన ఇమేజ్ వెళ్లపోయిందా? ఎందుకంటే తన వల్ల ఇద్దరు హీరోల తలరాతలు మారిపోతున్నాయి..

Post Published By: dialnews
Updated : 21 April 2026, 7:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా కథలను మించిపోయాడా? అంటే కొన్ని కథలకి తను సూట్ అయినా.. అవి తనకి సూట్ కాని స్టేజ్ కి తన ఇమేజ్ వెళ్లపోయిందా? ఎందుకంటే తన వల్ల ఇద్దరు హీరోల తలరాతలు మారిపోతున్నాయి.. ఆల్రెడి తను చేయాల్సిన కథతోనే రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. పెద్దిగా మారాడు. కట్ చేస్తే ఇలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఎన్టీఆర్ కథకే కనెక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ వదిలేసిన కథనే తను సొంతం చేసుకున్నాడు.. ఇది కూడా ఎన్టీఆర్ సలహా మీదే జరిగిందా? ఆ డౌట్ అటుంచితే, ఎందుకు నచ్చిన కథని ఓకే చేశాక కూడా ఎన్టీఆర్ ఇలా వాటిని వదులుకుంటున్నాడు... అంతా డ్రాగన్ వల్లేనా? డ్రాగన్ రెండో భాగం కూడా ప్లాన్ చేశారు కాబట్టే, కొన్ని కథల్ని, ప్రాజెక్టులని తను వదులుకుంటున్నాడా?

చిన్నప్పుడు చిన్న చైర్లో సరదగా కూర్చోవచ్చు.. కాని పెద్దయ్యాక అదే కుర్చీలో కూర్చుంటే విరిగిపోతుంది... ఎందుకంటే మన వేయిట్, హైట్ పెరిగిపోతుంది కాబట్టి.. సినిమా కూడా అంతే.. కొన్నిసార్లు హీరోలకి కథ నచ్చొచ్చు.. కాని ఆ కథనేమించే ఇమేజ్ వాళ్లకుంటే, ఆ సినిమాకు ఆ హీరో ఇమేజే డ్యామేజ్ అవుతుంది.అందుకే ఎన్టీఆర్ కొన్నిసార్లు కథల్ని వదులుకోవాల్సి వస్తోందా? కొన్ని కథలని ఎన్టీఆర్ ఇమేజ్ నిజంగా దాటేసినట్టేనా? ఆల్రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది కథని ఎన్టీఆర్ వదులుకున్నాడు. ఇప్పుడు మరో కథని కూడా వదులుకుంటన్నాడు.. అంటే ఆ కథలు తనకి సరిపోవు.. కాని చరణ్, విజయ్ దేవరకొండలకి సరిపోతాయా? అది కొంతవరకు నిజమే కాని.. పూర్తిగా కాదు.

ఎందుకంటే రామ్ చరణ్ చిన్నకటౌట్ ఏం కాదు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసే త్రిబుల్ ఆర్ చేశారు. నాటు పాటతో గ్లోబల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే ఎన్టీఆర్ కి ఊర మాస్ ఇమేజ్ ఉంది. దేవరతో పాన్ ఇండియాని జక్కన్న సాయం లేకుండా షేక్ చేశాడనే పేరుంది. అలా చూస్తే చరణ్ కంటే కొన్ని మెట్లు పైనే ఉన్నాడు. అది కాకుండా సాఫ్ట్ రోల్స్ తనకి సూట్ అవ్వవు..సాలిడ్ రగ్గుడ్ రోల్స్ ని తేలిగ్గా హ్యాండిల్ చేసే తనకి, పెద్ది పాత్ర నచ్చినా, అది చరణ్ కే సూటవుతుందని త్యాగం చేశాడు ఎన్టీఆర్. ఇక్కడ కథని మించే ఇమేజ్ మాత్రమే కాదు, కొన్నిసార్లు సాఫ్ట్ నెస్, హార్డ్ నెస్ ఇలా చూసినా ఆ మూవీలో పాత్రని, మించేంత వేయిట్ ఎన్టీఆర్ ఇమేజ్ లో ఉండటం కూడా కారణం కావొచ్చు.. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా చిన్న కటౌట్ ఏం కాదు.

తనకి అర్జున్ రెడ్డి పుణ్యమాని, ఎన్ని ప్లాపులు వచ్చినా అప్పెడెప్పుడో క్రియేట్ అయిన ఇమేజ్ అలానే ఉంది.. ఐతే హాయ్ నాన్న దర్శకుడు ఎన్టీఆర్ కోసమే రాసుకున్న కథని, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒప్పుకున్నాడు. కాని డ్రాగన్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం, షూటింగ్ ఇంకో ఏడాదిన్నర పాటు జరిగే ఛాన్స్ ఉండటంతో, హాయ్ నాన్న దర్శకుడు శౌర్యవ్ కథని, వదులుకున్నాడట..ఇది కూడా మాస్ ఎమోషన్స్ ఉన్నా, పాత్ర కాస్త సాఫ్ట్ గా ఉండటం, ఆ పాత్రని, కథని మించే ఇమేజ్ భారం ఎన్టీఆర్ కి ఉండటంతో, ఆప్రాజెక్ట్ ని రౌడీ స్టార్ కి త్యాగం చేసినట్టు తెలుస్తోంది. ఎలాగైటే పెద్ది కథ చరణ్ దగ్గరికి వెల్ళేలా బుచ్చి బాబుని ఎన్టీఆర్ గైడ్ చేశాడో, ఇప్పుడు శౌర్యవ్ కథని రౌడీ స్టార్ దగ్గరికి వెళ్లేలా ఎన్టీఆరే సలహా ఇచ్చాడని తెలుస్తోంది.

Published : 
  • 21 April 2026, 7:50 PM IST