ఓక్కో సినిమా ఒక్కో NTR..PANINDIA నయాట్రెండ్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇక నుంచి తన ఒక్కో సినిమాలో, ఒక్కో ఎన్టీఆర్ ని చూపిస్తాడా? పాన్ ఇండియా ట్రెండే మార్చేలా ఉన్నాడా?

Post Published By: dialnews
Updated : 13 February 2026, 1:45 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇక నుంచి తన ఒక్కో సినిమాలో, ఒక్కో ఎన్టీఆర్ ని చూపిస్తాడా? పాన్ ఇండియా ట్రెండే మార్చేలా ఉన్నాడా? ప్రస్తుతం తన స్ట్రాటజీ చూస్తుంటే,ఒకేలాంటి ఇమేజ్ ని క్యారీచేయటం తను మానేసినట్టే అంటున్నారు. పాన్ ఆసియా మీద గట్టిగానే గురిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఎంతగా ఈ ప్రాజెక్ట్ ని డిలే చేస్తున్నా ఊరుకుంటున్నాడు. అంతటికీ ఒకటే కారణం, సేఫ్ మూవీలకంటే లాంగ్ రన్ కోసం హై రిస్క్ తీసుకునేందుకు ఫిక్స్ అవటమే.. తన ప్రతీ సినిమాకు ఇమేష్ షిఫ్ట్ కావాలి... ఇది తన టార్గెట్ కాని అదెలా సాధ్యం.. ఒక మూవీ వల్ల వచ్చిన ఇమేజ్ మరో సినిమా రిలీజ్ కల్లా మారిపోవటం ఇంతవరకు ఏ స్టార్ కి జరగలేదు.. అదే జరగాలనేది ఎన్టీఆర్ స్ట్రాటజీ అనంటున్నారు. అంటే డ్రాగల్ లో ఒక ఎన్టీఆర్, గాడ్ ఆఫ్ వార్ లో మరో ఎన్టీఆర్, దేవర సీక్వెల్ లో ఇంకో ఎన్టీఆర్.. ఇలా సినిమాకో ఎన్టీఆర్ ని తను పరిచయం చేయబోతున్నాడా? అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ వెన్నుపోటుని కూడా కత్తిపోటులా భరించేస్తున్నాడా?

ఎన్టీఆర్ వార్ 2 రిజల్ట్ తర్వాత పూర్తి గా మారిపోయాడా? కేవలం పాన్ ఇండియా ట్రెండ్ ఫాలో అవటం కాదు.. అసలా ట్రెండ్ కి సంబంధం లేకుండా, తనని తాను సరికొత్త గా మార్చుకుంటున్నాడు. అందులో భాగంగానే సమ్మర్ లో రావల్సిన డ్రాగన్, సంక్రాంతికే వచ్చేలా డిలే అయినా నో ప్రాబ్లమ్... నచ్చిందే చేస్తా, నచ్చిన దార్లో వెలతా అన్న ధోరనితో వెళుతున్నాడు.ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ లో ఇరుక్కున్నట్టు, తాను కూడా అలాంటి ఇమేజ్ లో ఇరుక్కోకూడదనేది ఎన్టీఆర్ ప్రైమరి డిసీజన్.. ఇంతకి పాన్ ఇండియా ఇమేజ్ అంటే ఏంటి? ఒక సారి లార్జర్ దేన్ లైఫ్ అనిపించే సినిమా చేస్తే, అలాంటి హిట్ పడితే, ఏం చేసినా, ఏం చూజ్ చేసుకున్నా, అన్నీ అంతకుమించి అనే కథలే ఎంచుకోవలి.. కాని అలాంటి కథ లు పడటం, దర్శకులు దొరకటం కష్టం..

అక్కడే పాన్ ఇండియా ఇమేజ్ హీరోలకు భారంగా మారుతుంది.రామ్ చరణ్ అలాంటి ఇమేజ్ కిందే నలిగిపోతున్నాడు. ప్రభాస్ మూడు సార్లు నలిగి, సలార్, కల్కీ హిట్లతో ఫేట్ ని జయించాడు.. కాని ఇలా పంచ్ లు పడి, తర్వాత హిట్లు సొంతమయ్యాక గట్టెక్కడం కాదు.. అసలు రూటే మార్చేస్తే పోలా అన్నట్టు లెక్కే మార్చాడు ఎన్టీఆర్.ఏం చేసినా ప్రతీ మూవీకి ఒక కొత్త ఎన్టీఆర్ ని పరిచయం చేయాలనటమే మ్యాన్ ఆఫ్ మాసెస్ సరికొత్త స్ట్రాటజీ.. అందుకోసం జోనర్లు మాత్రమే కాదు, అందులో తను వేసే క్యారెక్టర్లు కూడా మారిపోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు. డ్రాగన్ లో రెండు పాత్రలు వేయటమే కాదు, తన లుక్ కూడా ఎన్నడూ చూడని ఎన్టీఆర్ ని చూపించేలా ఉంది. కట్ చేస్తే తర్వాత చేసే గాడ్ ఆఫ్ వార్ లో ఇంతకు భిన్నమైన లుక్ లో భారీ మజిల్స్ తో కనిపిస్తాడట.

అంటే వేసే పాత్రే , జోనర్ మాత్రమే కాదు తన లుక్ కూడా సినిమా సినిమాకు మారిపోవాలనేది ఎన్టీఆర్ స్ట్రాటజీ.. క్రాఫ్ మార్చినంత మాత్రాన లుక్ మారినట్టు కాదు.. కాబట్టే తన ఫిజికల్ లుక్ ని కూడా ప్రతీ మూవీకి మార్చాలని డిసైడ్ అయ్యాడు. అలా ప్రతీ మూవీకి తన లుక్ మార్చాలంటే, సినిమా షూటింగ్ కంటే, తన లుక్ మార్చటానికే ఎక్కువ టైం పడుతుంది.అయినా పర్లేదు... తన ప్రతీ మూవీ రీ ఫ్రెష్ గా అనిపించాలంటే, జోనర్, క్యారెక్టర్ తోపాటు తన ఫిజికల్ లుక్ కూడా మార్చాలనే నిర్ణయానికి వచ్చాడు కాబట్టే, డ్రాగన్ షూటింగ్ డిలే అయినా.. తన లుక్ ని ఇప్పుడు మూడో సారి మార్చుకుంటున్నాడు. ఆల్రెడీ ఒక పాత్ర షూటింగ్ అయిపోయింది. రెండో పాత్ర షూటింగ్ జరుగుతున్న టైంలో మరోసారి సన్నబడి ఇంకా బక్కచిక్కే ప్రయత్నం చేస్తున్నాడు. గత హిట్ తాలూకు ఇమేజ్ ని పక్కన పెట్టి, ఎప్పటికప్పుడు కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేయటం వల్లే, పాన్ ఇండియ ట్రెండ్ మార్చొచ్చనేది ఎన్టీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది.

Published : 
  • 13 February 2026, 1:45 PM IST