పాన్ ఇండియా గడ్డ ప్యారడైజ్ అడ్డా.!

నేచురల్ స్టార్ నాని మరియు టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ సినిమాలు నార్త్‌లో విజయం సాధించాలంటే కేవలం మంచి కంటెంట్ ఉంటే సరిపోదని, ప్రమోషన్స్

Post Published By: dialnews
Updated : 2 September 2026, 5:55 PM IST

నేచురల్ స్టార్ నాని మరియు టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సౌత్ సినిమాలు నార్త్‌లో విజయం సాధించాలంటే కేవలం మంచి కంటెంట్ ఉంటే సరిపోదని, ప్రమోషన్స్ చాలా దూకుడుగా ఉండాలని చిత్రయూనిట్ భావిస్తోంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో నాని ప్లాన్ చేస్తున్న పబ్లిసిటీ వ్యూహాలు అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా గ్లోబల్ లెవెల్ నుండి బాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
సాధారణంగా పాన్-ఇండియా హీరోలు ముంబై వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టి వస్తుంటారు కానీ నాని చాలా విభిన్నమైన ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌తో కలిసి అమెరికాలో జరిగే కాన్సర్ట్స్‌లో పాల్గొంటూ ఓవర్సీస్‌లో ఇప్పటికే పెద్ద బజ్ క్రియేట్ చేశారు.
సినిమాలోని 'ఆయా షేర్', 'యెశనాగుల కట్టి మీద' వంటి పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది.
అమెరికా ప్రచారం ముగిసిన వెంటనే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ వంటి కీలకమైన ఉత్తరాది రాష్ట్రాలపై నాని ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. సరైన ప్రమోషన్లు ఉంటే తొలి రెండు రోజుల్లోనే ఊహించని రేంజ్‌లో బాక్సాఫీస్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి.
ఇప్పటివరకు సౌత్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాని, హిందీలో సొంతంగా ఒక భారీ సోలో మార్కెట్‌ను స్థాపించాలని ప్లాన్ చేస్తున్నారు.

'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను దానికి పదిరెట్లు అద్భుతంగా తెరకెక్కించారని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో ప్రముఖ నటులు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ విలన్లుగా నటిస్తుండగా, కైదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అంతేకాకుండా ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ఒక పూర్తిగా షాకింగ్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Published : 
  • 2 September 2026, 5:55 PM IST