ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న 'పెద్ది' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది!. 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. 'గేమ్ ఛేంజర్' వరకు 80 - 90 కోట్ల మధ్యలో ఉన్న చరణ్ గ్రాఫ్, ఇప్పుడు ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
సినిమా షూటింగ్ దశలో ఉండగానే చరణ్ ఇమేజ్ వల్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుండటంతో నిర్మాతలు ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి వెనకాడటం లేదు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు 400 కోట్ల నుండి 500 కోట్ల మధ్యలో ఉంది. 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథ కావడంతో, ఆ కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్లు వేశారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఆధ్వర్యంలో విజయనగరం టౌన్ ని తలపించే భారీ సెట్ ను హైదరాబాద్ లో నిర్మించారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ఆడియో రైట్స్ 25 కోట్లకు అమ్ముడై రికార్డ్ సృష్టించాయి.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు దక్కించుకుంది. ఆడియో, డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే సినిమా సగం బడ్జెట్ రికవరీ అయిపోయిందని సమాచారం. థియేట్రికల్ బిజినెస్ కూడా 300 కోట్లు దాటే అవకాశం ఉంది. పెద్ది సినిమా ఏప్రిల్ 30, 2026న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రంగస్థలం తర్వాత మళ్ళీ చరణ్ చేస్తున్న విలేజ్ డ్రామా కావడంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.