తెలుగు చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాజమౌళి, వరుస విజయాలను అందుకుంటూ సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు.