బుల్లితెరపై కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్ మీద చూడటానికే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనిపించే రేంజ్లో బాండింగ్ మెయింటెన్ చేసే జోడీల్లో రవికృష్ణ - నవ్యస్వామి ఒకరు. 'ఆమే కథ' సీరియల్ నుంచి మొదలైన వీళ్ల కెమిస్ట్రీ, ఆ తర్వాత ఎన్నో స్పెషల్ షోలు, ఈవెంట్స్ ద్వారా గ్రాండ్‌గా కంటిన్యూ అవుతూనే ఉంది.ఎప్పుడు వీళ్ల గురించి క్లారిటీ అడిగినా.. "అయ్యో, మేమిద్దరం జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అండీ" అని నవ్వేసి ఊరుకునేవారు. కానీ, తాజాగా ప్రసారమైన ఒక టీవీ షో ప్రోమో చూస్తే మాత్రం సీన్ వేరేలా ఉందే అనిపించక మానదు.స్టార్ మాలో ప్రసారమవుతున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో ఈసారి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్‌కి ఇండస్ట్రీలోని పాపులర్ ఫ్రెండ్స్ జోడీలందరినీ ఆహ్వానించారు.
శేఖర్ మాస్టర్-రఘు మాస్టర్, ధనాధన్ ధన్‌రాజ్-వేణు, సుప్రీత-నిఖిల్, ఎక్స్‌ప్రెస్ హరి-యాదమ్మ రాజులతో పాటు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు రవికృష్ణ అండ్ నవ్యస్వామి షో అంతా ఒకెత్తయితే, ఈ ఇద్దరి మధ్య జరిగిన రచ్చ ఇంకో ఎత్తుగా మారింది. హోస్ట్ శ్రీముఖి ఈ జోడీకి ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చింది. ఒకరి మెడలో ఒకరు బోర్డు తగిలించుకుని.. మామూలుగా పిలుచుకునే పేర్లు కాకుండా, ఒకరినొకరు సీక్రెట్‌గా ఏ ముద్దుపేరుతో పిలుచుకుంటారో రాయమన్నారు. నవ్యస్వామి తన బోర్డు మీద రవికృష్ణ గురించి "హీరో" అని రాసింది.రవికృష్ణ బోర్డు మీద నవ్య గురించి రౌడీ ఫెలో అని రాశాడు. ఇది చూసినవెంటనే కామెడీ స్టార్ ఎక్స్‌ప్రెస్ హరి కల్పించుకుని.. "ఇవి ఎక్కడైనా ఫ్రెండ్స్ పిలుచుకునే పేర్లా బాస్? పక్కాగా లవర్స్ మాత్రమే ఇలాంటి ముద్దుపేర్లు పెట్టుకుంటారు!" అని పంచ్ వేయడంతో సెట్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
అక్కడితో ఆగకుండా నవ్యస్వామి ఓ అడుగు ముందుకేసి.. "ఎవరేమనుకున్నా, నా దృష్టిలో రవి ఎప్పటికీ హీరోనే" అని ఓపెన్‌గా చెప్పేసింది! దాంతో వీళ్లద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని, ప్రేమేనని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. కేవలం ఈ టాస్క్ మాత్రమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ "రూపు తేరా మస్తానా" పాటకు రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్లతో కలిసి రవి, నవ్య వేసిన స్టెప్పులు షోకి గ్లామర్ జోడించాయి. మైసూర్ నుంచి వచ్చి 'ఆహ్వానం', 'నా పేరు మీనాక్షి' సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది నవ్యస్వామి. ఇటు రవికృష్ణ బుల్లితెరపై సక్సెస్ అయి, 'విరూపాక్ష', 'దండోరా' లాంటి హిట్ సినిమాలతో వెండితెరపై కూడా నటుడిగా బిజీ అవుతున్నాడు. కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటున్న రవి, మళ్లీ నవ్యతో కలిసి ఇలాంటి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు ఫుల్ విందులా మారింది.