సరైన సమయంలో ‘సార్పట్ట-2’..!

తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లలో ‘సార్పట్ట పరంపరై-2’ ఒకటి. పా. రంజిత్ - ఆర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్పట్ట పరంపరై’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

Post Published By: dialnews
Updated : 3 August 2026, 8:15 PM IST

తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లలో ‘సార్పట్ట పరంపరై-2’ ఒకటి. పా. రంజిత్ - ఆర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్పట్ట పరంపరై’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రతి ఒక్కరినీ అలరించింది.అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు ఇందులో హీరోయిన్‌గా నటించిన టాలెంటెడ్ నటి దుషారా విజయన్. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమా గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల 'కట్లాన్' సినిమాతో పాటు 'ఎగ్జామ్' అనే వెబ్ సిరీస్‌తో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న దుషారా, ప్రస్తుతం తమిళంలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు. భారతీయ ప్రముఖ శాస్త్రవేత్త జి.డి. నాయుడు బయోపిక్‌గా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాలో సీనియర్ నటుడు ఆర్‌. మాధవన్ సరసన ఆమె కథానాయికగా నటిస్తున్నారు. యాక్షన్ హీరో విశాల్ సరసన 'మకుటం' అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ లైనప్ చూస్తుంటేనే అర్థమవుతోంది.. దుషారా విజయన్ ఎలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ దూసుకుపోతున్నారో! అని.
‘సార్పట్ట-2’ గురించి మాట్లాడిన దుషారా విజయన్ ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆగస్టు నెలలోనే ‘సార్పట్ట-2’ షూటింగ్ ప్రారంభం కాబోతోంది అని ఆమె క్లారిటీ ఇచ్చేశారు.

మళ్ళీ ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్, పశుపతి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా గురించి దుషారా ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ చెప్పారు. సాధారణంగా పార్ట్-1 కథ ఎక్కడ ముగిసిందో, అక్కడ నుంచి పార్ట్-2 మొదలవుతుంది. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగడం లేదట. ఈ చిత్రం కేవలం ముందటి కథకు కొనసాగింపు మాత్రమే కాదు.. అసలు కథ కంటే ముందు ఏం జరిగింది? పాత్రల నేపథ్యం ఏమిటి? అని చూపించే ఒక ‘ప్రీక్వెల్’గా రాబోతోంది! అని ఆమె స్పష్టం చేశారు.అంటే, మనం మొదటి భాగంలో చూసిన క్యారెక్టర్ల గతం, అసలు ఆ విరోధాలు ఎలా మొదలయ్యాయి అనే విషయాలను పా. రంజిత్ ఈసారి మరింత ఊరమాస్ స్టైల్లో చూపించబోతున్నారన్నమాట.

అంతేకాకుండా, మొదటి భాగంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తన ‘మరియమ్మ’ క్యారెక్టర్ ఈ పార్ట్‌లో కూడా సందడి చేయబోతోందని దుషారా చెప్పారు. కోవిడ్ లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ‘సార్పట్ట పరంపరై’ మొదటి భాగం నేరుగా OTTలోనే విడుదలైన సంగతి మనకు తెలిసిందే. సినిమా అంత పెద్ద హిట్ అయినప్పటికీ, థియేటర్‌లో ఆ విజిల్స్, ఆ మాస్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయ్యామని చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అయితే ఆ నిరాశకు దుషారా ఫుల్ స్టాప్ పెట్టేశారు! ‘సార్పట్ట-2’ ని మాత్రం ఖచ్చితంగా థియేటర్లలోనే చాలా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. థియేటర్లలో ఈ సినిమా తెచ్చే ఊపు, మాస్ రచ్చ వేరే లెవల్లో ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ విజయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని దుషారా ధీమా వ్యక్తం చేశారు.మొత్తానికి సార్పట్ట పరంపర మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దిగబోతోంది! మరి ఈ ప్రీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Published : 
  • 3 August 2026, 8:15 PM IST