ఏం ఎత్తుకున్నావ్ టిల్లూ…!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక పేరు మార్మోగిపోతోంది.. అదే 'స్టార్ బాయ్' సిద్ధూ జొన్నలగడ్డ. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధూ, కేవలం కామెడీకే పరిమితం కాకుండా తన రూట్ మార్చబోతున్నాడు

Post Published By: dialnews
Updated : 18 March 2026, 11:55 AM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక పేరు మార్మోగిపోతోంది.. అదే 'స్టార్ బాయ్' సిద్ధూ జొన్నలగడ్డ. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధూ, కేవలం కామెడీకే పరిమితం కాకుండా తన రూట్ మార్చబోతున్నాడు. తన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు తన తదుపరి చిత్రాలతో డిఫరెంట్ జోనర్‌లను టచ్ చేయబోతున్నాడు. డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఆ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న దర్శకుడు స్వరూప్ RSJ ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ కోసం ఒక ఫాసినేటింగ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.

సిద్ధూలోని మాస్ అండ్ క్లాస్ కామెడీకి, స్వరూప్ మార్క్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తోడైతే థియేటర్లలో రచ్చ ఖాయం. ఒక పక్కా ఇన్వెస్టిగేటివ్ లేదా క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగబోతున్నట్లు సమాచారం. ‘సర్’, లక్కీ భాస్కర్ వంటి హిట్స్ అందుకున్న క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సిద్ధూ ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఇది థియేట్రికల్ రిలీజ్ మాత్రమే కాకుండా, నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్‌గా రాబోతుండటం విశేషం. ఇది ఒక ఎమోషనల్ డ్రామా లేదా రొమాంటిక్ స్టోరీ అయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో సిద్ధూ ఎంట్రీ ఇవ్వడం అతని మార్కెట్‌ను మరింత పెంచడం ఖాయం.

సిద్ధూ లైనప్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఒక సోషియో ఫాంటసీ సినిమా. ఒక కొత్త దర్శకుడితో ఈ ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ ఐడియాను సిద్ధూ సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. తెలుగు ప్రేక్షకులకు సోషియో ఫాంటసీ సినిమాలు అంటే ఎప్పుడూ మక్కువే, మరి సిద్ధూ తనదైన స్టైల్‌లో ఈ జోనర్‌ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి. కేవలం 'టిల్లు' ఇమేజ్‌కి మాత్రమే స్టిక్ అవ్వకుండా, సిద్ధూ జొన్నలగడ్డ ఇలా విభిన్నమైన జోనర్లను ఎంచుకోవడం చూస్తుంటే, అతను టాలీవుడ్‌లో ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి సిద్ధమయ్యాడని అర్థమవుతోంది. ఈ మూడు సినిమాలు సిద్ధూని కేవలం ఒక కామెడీ హీరోగా కాకుండా ఒక కంప్లీట్ వర్సటైల్ యాక్టర్‌గా నిలబెడతాయనడంలో సందేహం లేదు.

 

Published : 
  • 18 March 2026, 11:55 AM IST