పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త వచ్చేసింది.
హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే ఒక సెన్సేషన్. 'గబ్బర్ సింగ్' తర్వాత వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.తాజాగా ఈ సినిమా నుండి మోస్ట్ అవేటెడ్ సాంగ్ కాలరే ఎత్తరా అప్డేట్ బయటకి వచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ఈ పాట గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ వీకెండ్‌లోనే 'కాలర్ ఎయ్ ఎత్తరా' పాట విడుదల కాబోతోంది.మరీ ముఖ్యంగా, హరీష్ శంకర్ కెరీర్‌లోనే ఇది అత్యంత ఖరీదైన పాట అని చెప్పడం విశేషం. భారీ సెట్లు, వేలమంది డ్యాన్సర్లు, మరియు విజువల్ గ్రాండియర్ ఈ పాటలో మనకు కనిపించబోతున్నాయి.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ బీట్స్ ఇచ్చారు.రీసెంట్‌గా వచ్చిన విజయ్ 'నా రెడీ' సాంగ్ లెవల్‌లో ఈ పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
పవన్ కళ్యాణ్ మాస్ స్టెప్పులు, ఆటిట్యూడ్ ఈ పాటకి మెయిన్ హైలైట్ కానున్నాయి. ఈ సినిమా మార్చి 19, 2026 న ఉగాది కానుకగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
బిజిఎమ్ కోసం థమన్ కూడా టీమ్‌లోకి చేరడంతో మ్యూజికల్ గా సినిమా వేరే లెవల్‌లో ఉండబోతోంది.ప్రస్తుతం డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.