సెన్సేషనల్ రౌడీ జనార్ధన్…!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ తన గర్జనను వినిపించడానికి సిద్ధమవుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన విజయ్, ఇప్పుడు అంతకు మించిన ఇంటెన్సిటీతో ‘రౌడీ జనార్ధన్’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు

Post Published By: dialnews
Updated : 14 April 2026, 5:52 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ తన గర్జనను వినిపించడానికి సిద్ధమవుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన విజయ్, ఇప్పుడు అంతకు మించిన ఇంటెన్సిటీతో ‘రౌడీ జనార్ధన్’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే, విజయ్ దేవరకొండ తన కెరీర్‌లోనే అత్యంత వైల్డ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తారని అర్థమవుతోంది.

ఒళ్లంతా రక్తం, కళ్ళలో కసి, చేతిలో పదునైన ఆయుధంతో కనిపిస్తున్న విజయ్ లుక్ ఈ సినిమా ఏ రేంజ్ యాక్షన్‌తో ఉండబోతుందో హింట్ ఇచ్చింది. ఈ రాయలసీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కథలో విజయ్ ఒక పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టీమ్ ప్రస్తుతం ఒక కీలకమైన షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. ముఖ్యంగా సినిమాలోనే అత్యంత కీలకంగా మారనున్న ఇంటర్వెల్ సీన్ కోసం చిత్ర బృందం ఒక భారీ సెట్‌ను నిర్మిస్తోంది. సాధారణంగా సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్ అంటేనే ఒక రేంజ్ ఎలివేషన్ ఉంటుంది, కానీ ‘రౌడీ జనార్ధన్’లో ఈ ఇంటర్వెల్ సీన్ వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోందని టాక్.

ఈ భారీ సెట్‌లో విజయ్ దేవరకొండపై అత్యంత హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ప్రేక్షకులు థియేటర్లలో సీట్ల నుంచి లేచి గోల చేసేలా దర్శకుడు రవి కిరణ్ కోలా దీనిని ప్లాన్ చేశారట. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఎక్కడా వెనకాడకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ పాత్రకు సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ ద్వారా రూరల్ మాస్ కంటెంట్‌ను ఒక కొత్త కోణంలో చూపించబోతున్నట్లు యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

దర్శకుడు రవి కిరణ్ కోలా గతంలో ‘రాజా వారు రాణి గారు’ వంటి క్లాసిక్ ఫీల్ గుడ్ మూవీని ఇచ్చారు, కానీ ఈసారి ఆయన పూర్తి భిన్నమైన ‘రా అండ్ రస్టిక్’ కథతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ‘రౌడీ జనార్ధన్’ చాలా కీలకం. ఫ్యాన్స్ తన నుంచి ఏవైతే కోరుకుంటున్నారో.. అంటే ఆ కసి, ఆ యాటిట్యూడ్, ఆ వైల్డ్ పర్ఫార్మెన్స్.. వాటన్నింటినీ ఈ సినిమాలో పుష్కలంగా చూడబోతున్నాం. దీనికి తోడు భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. రౌడీ జనార్ధన్’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇందులో బలమైన ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరి ఈ భారీ సెట్‌లో షూట్ చేయబోతున్న ఇంటర్వెల్ యాక్షన్ సీన్ విజయ్ దేవరకొండను మళ్ళీ బాక్సాఫీస్ కింగ్‌గా నిలబెడుతుందో లేదో చూడాలి.

Published : 
  • 14 April 2026, 5:52 PM IST