సస్పెన్స్ డ్రామాగా లక్కీ భాస్కర్ 2.!

దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను మిక్స్ చేసి వెంకీ అట్లూరి

Post Published By: dialnews
Updated : 1 August 2026, 5:46 PM IST

దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను మిక్స్ చేసి వెంకీ అట్లూరి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది.అయితే ఈ సినిమా థియేటర్లలో పూర్తయినప్పటి నుంచీ ప్రతీ ఒక్కరి మనసులో నడుస్తున్న ఒకే ఒక ప్రశ్న... 'లక్కీ భాస్కర్ 2' సీక్వెల్ ఉందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? అని. దీనిపై దర్శకుడు వెంకీ అట్లూరి స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. లక్కీ భాస్కర్ సినిమాని ప్రేక్షకులు చాలా పెద్ద హిట్ చేశారు. నాకూ పార్ట్-2 చేయాలనే ఉంది. కానీ ఒక హిట్ సినిమాకి సీక్వెల్ అనగానే జనాలు చాలా అంచనాలతో వస్తారు.

కేవలం పార్ట్-1 హిట్ అయింది కదా అని ఏదో ఒక కథతో హడావుడిగా పార్ట్-2 తీయడం నాకు అస్సలు ఇష్టం లేదు. మొదటి భాగాన్ని మించేలా ఒక బలమైన కథ సిద్ధమైనప్పుడే 'లక్కీ భాస్కర్ 2' ప్రాజెక్ట్‌ను మొదలుపెడతాను" అని ఆయన చెప్పారు.అంటే.. పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే సరైన కథ కుదిరే వరకు కొంచెం టైమ్ పడుతుందన్నమాట.ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లోనే ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వచ్చే ఆగస్టు 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సూర్య సినిమా పూర్తయిన తర్వాత కూడా 'లక్కీ భాస్కర్ 2' వెంటనే ఉండదట. దానికంటే ముందు ఆయన మరో రెండు సినిమాలు లైనప్‌లో పెట్టారు. గతంలో ధనుష్‌తో 'సార్' సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన వెంకీ, మళ్లీ ధనుష్ కాంబినేషన్‌లోనే ఒక కొత్త ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ధనుష్ సినిమా అయిపోయాక, హాలీవుడ్ క్లాసిక్ 'హోమ్ అలోన్' కాన్సెప్ట్ తరహాలో ఒక పూర్తిస్థాయి ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారట. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ఆయన పూర్తి స్థాయిలో 'లక్కీ భాస్కర్ 2' స్క్రిప్ట్ పనులపై దృష్టి పెడతానన్నారు. లక్కీ భాస్కర్ 2 రావడానికి కొంచెం టైమ్ పట్టినా, ఈలోపు వెంకీ అట్లూరి నుంచి సూర్య సినిమా, ధనుష్ సినిమా, మరియు ఒక క్రేజీ 'హోమ్ అలోన్' తరహా సినిమా మన ముందుకు రాబోతున్నాయి.

Published : 
  • 1 August 2026, 5:46 PM IST