Prabhas Vs Suriya: కర్ణుడితో కర్ణుడి ఫైట్.. ప్రభాస్ వర్సెస్ సూర్య

రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడిగా వస్తుంటే, కోలీవుడ్ నుంచి కర్ణుడిగా సూర్య రంగంలోకి దిగుతున్నాడు. ఒకేసారి ఇద్దరు కర్ణుల మధ్య వార్ జరగబోతోంది అది కూడా బాక్సాఫీస్ వార్. అదే జరిగితే పాన్ ఇండియా లెవల్లో కర్ణ వర్సెస్ కర్ణగా సీన్ మారుతుంది.

Post Published By: narender Thiru
Updated : 4 August 2023, 5:15 PM IST

Prabhas Vs Suriya: కర్ణుడు మహా భారతంలో ఓ రకంగా పవర్ ఫుల్ హీరోనే. కాని రాంగ్ సైడ్ ఉండటం, గతంలో చేసిన కర్మఫలాలు యుద్ద సమయంలో బెడిసికొట్టడంతో శాడ్ ఎండింగ్ వచ్చింది. తను కౌరవుల వైపే నిలుచున్నా ఎందుకనో తన శక్తి, తనలోని చాలా క్వాలిటీస్ వల్ల కర్ణుడి పాత్ర ఆల్ మోస్ట్ అందరికీ నచ్చుతుంది. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు కర్ణుడి వెంటపడుతోంది. అంతవరకు బానే ఉంది కాని రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడిగా వస్తుంటే, కోలీవుడ్ నుంచి కర్ణుడిగా సూర్య రంగంలోకి దిగుతున్నాడు.

ఒకేసారి ఇద్దరు కర్ణుల మధ్య వార్ జరగబోతోంది అది కూడా బాక్సాఫీస్ వార్. రంగ్ దే బసంతి మూవీతో ట్రెండ్ సెట్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఇప్పుడు తమిళ హీరో సూర్యతో కర్ణ అంటూ రూ.600 కోట్ల బడ్జెట్‌తో మూవీ ప్లాన్ చేశాడు. విచిత్రం ఏంటంటే సీతారామం ఫేం హను రాఘవపూడి ఆల్రెడీ ప్రభాస్‌తో కర్ణుడి మూవీ తీయబోతున్నాడు. ఇది 2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తే, ఇప్పుడు సూర్యతో రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తీసేది కూడా అప్పడే రిలీజ్ అంటున్నారు. అదే జరిగితే పాన్ ఇండియా లెవల్లో కర్ణ వర్సెస్ కర్ణగా సీన్ మారుతుంది.

Published : 
  • 4 August 2023, 5:15 PM IST